ఫీజు బకాయి, బిజెపి లడాయి
తెలంగాణ రాష్ట్ర విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలి.
బిజెపి జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి
కొత్తగూడెం,(విజయ క్రాంతి): యువ మోర్చా, మహిళా మోర్చా ఆధ్వర్యంలో, ఫీజు రియంబర్స్మెంట్ పై మరియు స్కాలర్షిప్ల సమస్యల పై జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం పత్రిక మిత్రుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిజెపి అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని బిజెపి జిల్లా కార్యాలయంలో ఫీజు బకాయి బిజెపి లడాయి పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది.
అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం 40లక్షల మంది విద్యార్థులకు రావాల్సిన,15 వేల కోట్ల పాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను కాలంలో కాలేజీల యాజమాన్యానికి చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలని, లేదంటే విడతలవారీగా ఉద్యమాలు చేస్తామని డిమాండ్ చేశారు. పర్యటనలు, పోటీలకు ఉన్న నిధులు విద్యార్థులకు ఎందుకు లేవని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు ధ్రువపత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. మొత్తం రూ. 15వేల కోట్ల బకాయిలు ఉన్నాయని, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.






