15 March, 2026 | 8:39 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

శ్మశాన వాటికలో అక్రమ తవ్వకాలు

28-02-2026 12:00 AM

పాతిపెట్టిన శవాల తాలూకు ఎముకలు వెలుగు చూసిన ఘటన

కాగజ్నగర్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): ఉల్టాచూర్ కొత్వాల్కు దాటే ప్రాం తంలో కాగజ్నగర్ మండలం కోయవాగు పరిధిలో అక్రమ మైనింగ్ జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు లేండుగురే శ్యామ్‌రావ్ ఆరోపించారు. కాగజ్నగర్ మం డలంలోని కోయవాగు గ్రామంలో గత రెం డు సంవత్సరాలుగా అక్రమ మైనింగ్ జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.

గ్రామానికి చెంది న ఓ వ్యక్తి రాజకీయ నాయకుల అండదండలతో, ఎలాంటి మైనింగ్ లీజ్ లేదా గ్రామ పంచాయతీ అనుమతి లేకుండానే జేసీబీ యంత్రాల సహాయంతో హిం దూ శ్మశాన వాటికలో అక్రమంగా మట్టి తవ్వకాలు నిర్వహిస్తున్నాడన్నారు. సుమారు 10 ఎకరాల ప్రభుత్వ భూమిలో వేల మెట్రి క్ టన్నుల మట్టిని తవ్వి, ప్రైవేట్ వెంచర్లు మరియు వ్యక్తులకు విక్రయించి కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించుకున్నాడని తెలిపారు. దీనివల్ల ప్రభుత్వ ఖజా నాకు భారీ నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్న వారి పై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.