గిరిజనులకు అందని సంక్షేమ పథకాలు
గిరిజనుల అభివృద్ధికి పని చేయని అధికారులపై ఫిర్యాదు చేయండి
జిల్లాలో పర్యటించిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్
ఉట్నూర్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గ్రామాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను అమలు చేయని అధికారులపై జాతీయ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. శుక్రవారం ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలంలోని పలు మారుమూల గిరిజన గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గిరిజనులు ఎదుర్కొంటున్న సమ స్యలను వారిని అడిగి తెలుసుకున్నారు.
ఉట్నూరు మండలం నుండి కుమ్మరి తండా, ఇంద్రవెల్లి మండలంలోని హర్కాపూర్, మచ్చాపూర్ గ్రామాల్లో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆదివాసి గిరిజనుల ఆరాధ్య దేవుడు నాగోబాకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జాటోత్ హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ... నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రితేష్ రాథోడ్ ఉమ్మడి జిల్లాలోని గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి పలుమార్లు తీసుకురావడంతో జిల్లా పర్యటనకు రావ డం జరిగిందని గుర్తు చేశారు.
ఇక్కడి గ్రామాల్లోని గిరిజనుల పరిస్థితి చూస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అందడం లేదని తన దృష్టికి వచ్చిం దన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పీఎం జన్ మన్ యోజన పథకం తీసుకువచ్చి మారుమూల గిరిజనుల గ్రామాల అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తున్న కొన్ని శాఖల అధికారులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని గుర్తించడం జరిగింది. కొండ కోనల్లో ఉండే ఆదిమ గిరిజన తెగలకు రహదారులు, పక్కా గృహాలు, సాగు తాగునీరు, విద్య వైద్యం అందించాలని పీఎం జన్ మన్ యోజన పథకం తీసుకువస్తే అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారని గిరిజనులు తన దృష్టికి తీసుకువచ్చారని అన్నారు.
ఏజెన్సీ ప్రాం తంలో పనిచేసే అన్ని శాఖల అధికారులు గిరిజనుల అభివృద్ధికి అడ్డుపడితే ఆన్లైన్లో ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తే అధికారులను దిల్లీకి పిలిపించి సమస్యలు పరిష్కరిస్తామని గిరిజనులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో యువరాజ్ మార్మా ట్, స్థానిక సంస్థల కలెక్టర్ రాజేశ్వర్లు, బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్, డిఆర్డిఓ పి.డి రవీందర్ రాథోడ్, జిల్లా పం చాయతీ అధికారి రమేష్, ఎఫ్. డీ.ఓ చిన్న బూస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




