అదనపు కలెక్టర్‌గా బీ వెంకటేశ్వర్లు
28-02-2026 12:00 AM
నిర్మల్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాస్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించి కలెక్టర్ అభిలాష అభినవ్ ను తన ఛాంబర్ లో పూల మొక్కను అందించి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్, అదనపు కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.




