29 August, 2026 | 4:35 PM

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

21-05-2024 01:35 AM

బీజేపీ కిసాన్‌మోర్చా అదనపు కలెక్టర్‌కు వినతి

యాదాద్రి భువనగిరి, మే 20 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవం తం చేయాలని, లేదంటే రైతులతో కలిసి ఆందోళనలు ఉధృతం చేస్తామని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జగన్మోహన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఫకీర్ రాజేందర్ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం జిల్లా అదనపు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఫకీర్ రాజేందర్ రెడ్డి మాట్లాడు తూ.. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ఆలస్యమవడం వల్ల వర్షాలు పడి రైతులు నష్టపోతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షు లు చొక్కారెడ్డి, ప్రధాన కార్యదర్శి వల్దాస్ కాళబైరవ, రాములు, సురేష్‌రెడ్డి, మాణిక్యం రెడ్డి, పట్నం కిట్టు, దిలీప్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.