17 April, 2026 | 2:44 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

హైడ్రా కొరడా.. రూ.20 కోట్ల భూమి స్వాధీనం!

01-11-2025 08:21 PM

* ​మణికొండలో కబ్జాపై ఉక్కుపాదం

* ​రూ. 20 కోట్ల పార్కు స్థలానికి విముక్తి

* ​జేసీబీలతో అక్రమ కట్టడాలు ధ్వంసం

మణికొండ,(విజయక్రాంతి): ​విలువైన ప్రభుత్వ భూములే లక్ష్యంగా దందా సాగిస్తున్న కబ్జాదారులపై హైడ్రా  ఉక్కుపాదం మోపింది. ప్రజా ఫిర్యాదులపై తక్షణమే స్పందించిన అధికారులు, సుమారు రూ. 20 కోట్ల విలువైన పార్కు స్థలాన్ని అన్యాక్రాంతం కాకుండా కాపాడారు. అక్రమార్కుల చెరలో ఉన్న స్థలాన్ని శనివారం స్వాధీనం చేసుకున్నారు. ​వివరాల్లోకి వెళితే... గండిపేట మండలం, మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర కాలనీలో సర్వే నెం. 322-2655 లో 1600 గజాల పార్కు స్థలం ఉంది.

కొంతకాలంగా ఈ విలువైన స్థలంపై కన్నేసిన కొందరు అక్రమార్కులు, దానిని చెరపట్టి నిర్మాణాలు చేపట్టేందుకు యత్నించారు. ​దీనిపై స్థానికులు పలుమార్లు వివిధ శాఖల అధికారులకు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. దీంతో విసిగిపోయిన స్థానికులు, చివరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ప్రజావాణి లో ఫిర్యాదు చేశారు. ​కమిషనర్ ఆదేశాలతో  శనివారం రంగంలోకి దిగిన అధికారులు భారీ బందోబస్తు నడుమ జేసీబీలతో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. అనంతరం స్థలాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుని, ఇది ప్రభుత్వానికి చెందిన పార్కు స్థలం అని హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు.

​మరిన్ని స్థలాలు కూడా..

​ఈ ఆపరేషన్‌తో పాటే, మణికొండ పరిధిలో మరికొన్ని విలువైన ప్రభుత్వ స్థలాలను కూడా అధికారులు రక్షించారు. తిరుమల హిల్స్‌లో 6050 గజాల పార్కు స్థలం, వెస్ట్రన్ ప్లాజాలో ఒకటిన్నర ఎకరం ప్రభుత్వ స్థలాలను సైతం స్వాధీనం చేసుకుని, హైడ్రా బోర్డులను పాతారు. ఎట్టకేలకు విలువైన ప్రభుత్వ, పార్కు స్థలాలు కబ్జా చెర నుంచి విడిపించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.