calender_icon.png 2 November, 2025 | 11:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హలో దళితుడా.. చలో హైదరాబాద్

01-11-2025 08:20:42 PM

ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు కొలుపుల రామస్వామి ఆధ్వర్యంలో బయలుదేరిన నాయకులు

చేగుంట (విజయక్రాంతి): మెదక్ జిల్లా చేగుంట మండలానికి చెందిన ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కోలుపుల రామస్వామి ఆధ్వర్యంలో సీజేఐ బిఆర్ గవాయిపై దాడిని నిరసిస్తూ.. హలో దళితుడా చలో హైదరాబాద్ రాష్ట్ర ఎమ్మార్పీఎస్ నాయకులు పిలుపునివ్వడంతో మండల ఎమ్మార్పీఎస్ నాయకులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దాడి జరిగి 25 రోజులు గడిచిన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, దేనికి నిదర్శనమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడుతూ నిందితులపై కేసు నమోదు చేసి చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బక్క సాయి బాబా మాదిగ, కొన్మండ శంకర్ మాదిగ, కోమట స్వామి మాదిగ, ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.