calender_icon.png 2 November, 2025 | 11:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి

01-11-2025 08:23:14 PM

ఎస్సై గోపతి సురేష్..

లక్షెట్టిపేట (విజయక్రాంతి): ప్రతి ఒక్క వాహనదారుడు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఎస్సై గోపతి సురేష్ అన్నారు. శనివారం పట్టణంలోని కరీంనగర్ చౌరస్తాలో పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రత నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఎస్ఐ గోపతి సురేష్ మాట్లాడుతూ... వాహనాలు నడిపే సమయంలో వాహన పత్రాలైన ఆర్సితో పాటు ఇన్సూరెన్స్, పొల్యూషన్ లైసెన్స్ తప్పకుండా వెంట ఉంచుకోవాలన్నారు. ద్విచక్ర వాహనదారుడు వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని, కార్లు నడిపే సమయంలో సీట్ బెల్ట్ తప్పకుండా పెట్టుకోవాలన్నారు. వాహనాలను వేగంగా నడపకూడదని ఆటో డ్రైవర్లు పరిమితికి మించి వాహనాల్లో ప్యాసింజర్లను ఎక్కించుకోకూడదని ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్సై రామయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.