11 July, 2026 | 4:43 PM

అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యం స్వాధీనం.. ఒకరిపై కేసు నమోదు

11-07-2026 03:58 PM

భూపాలపల్లి,(విజయక్రాంతి): భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశాల మేరకు సీసీఎస్ సీఐ రమేష్  ఆధ్వర్యంలో సిసిఎస్ పోలీసు బృందం చేపట్టిన ప్రత్యేక తనిఖీలలో మొగుళ్లపల్లి మండలం అకినపల్లి గ్రామానికి చెందిన గౌరీశెట్టి కృష్ణమూర్తి అనే వ్యక్తి, కిరాణా దుకాణం నిర్వహిస్తూ అక్రమంగా సుమారు 6 నుండి 7 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని నిల్వ ఉంచినట్లు గుర్తించారు. సీసీఎస్ బృందం దాడి నిర్వహించి అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని, తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం నిందితుడిని, స్వాధీనం చేసిన బియ్యంతో పాటు మొగుళ్లపల్లి పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వ పథకాల కింద లబ్ధిదారులకు అందాల్సిన పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేయడం, నిల్వ చేయడం లేదా విక్రయించడం చట్టరీత్యా నేరం. ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఉన్నట్లయితే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా జిల్లా పోలీసులకు తెలియజేయాలని సీ ఐ కోరారు.