11 July, 2026 | 5:48 PM

దేవరకోటలో పూజలు

11-07-2026 04:16 PM

నిర్మల్,(విజయక్రాంతి): పట్టణములోని దేవరకోట ఆలయంలో శనివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నప్రసాద కార్యక్రమంలో విశేషంగా భక్తులు హాజరై స్వామి వారి యొక్క అన్న ప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్ చైర్మన్ అప్పల కావ్య గణేష్ చక్రవర్తి గారు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికి వారికి సన్మానం చేసి ఆలయ లో తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఆవిడ శ్రీనివాస్ కోటగిరి శ్రీధర్ మురారపు గంగాధర్ భక్తులు మరియు ఆలయ పూజారి నవీన్ పాల్గొన్నారు.