11 July, 2026 | 5:25 PM

ఘనంగా ఎమ్మెల్యే పల్లా జన్మదిన వేడుకలు

11-07-2026 04:13 PM

కొమురవెల్లి,(విజయక్రాంతి): జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదినం సందర్భంగా కొమురవెల్లి మల్లన్న  ఆలయంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని, రానున్న రోజుల్లో ఉన్నతమైన పదవులు పొంది, ప్రజలకు మరిన్ని సేవలందించాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు  ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రాజగోపురం ముందు కేకును కట్ చేసి ఒకరినొకరికి పంచుకున్నారు. అనంతరం భక్తులతో పాటు స్థానికులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, అభిమానులు పాల్గొన్నారు.