‘ఇందిరమ్మ’తో వెలుగులు!
- పైలెట్ గ్రామంగా మచ్చుపేట
ఇందిరమ్మ ఇండ్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన మంత్రి శ్రీధర్ బాబు
గ్రామాల్లో పేదవారిని గుర్తించి ఇందిరమ్మ ఇల్లు
ఇంటి నిర్మాణంతో ఆనందంలో పేద ప్రజలు
ముత్తారం,మార్చి 16 (విజయ క్రాంతి) తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు అందిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం తో గ్రామంలో ఇంటి ఇంటికి వెలు గు వస్తుంది. పెద్దపెల్లి జిల్లా ముత్తారం మం డలంలోని మచ్చుపేట గ్రామాన్ని పైలెట్ గ్రామంగా ఎంపిక చేసిన ఇండ్లకు పైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరుగుతుందని, ఇప్పటికే కొంతమంది ఇండ్లు నిర్మించుకోగా, మరికొంతమంది ఇండ్లను పూర్తి చేసుకుంటున్నారు.
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక ఫోకస్ పెట్టిన మంత్రి గ్రామాల్లో పేదవారిని గుర్తించి ఇందిరమ్మ ఇంటిని అంది స్తున్నారు. దీంతో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకున్న పేదింటి ప్రజలు ఆనందంలో ఉన్నారు.
ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారులు బేస్మెంటు, స్లాప్ లెవెల్ లోనే ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లిస్తుండడంతో లబ్ధిదారులు కూడా ఇంటి నిర్మాణాన్ని వెగంగా చేపడుతున్నారు. మచ్చుపేట గ్రా మంలోనే కాకుండా ముత్తారం మండలం లోని 14 గ్రామపంచాయతీలలో మొదటి విడుతలో గ్రామానికి కొన్ని ఇండ్లను మంత్రి శ్రీధర్ బాబు మంజూరు చేశారు. దీంతో మండలంలో ఇంట్లో లేని నిరుపేదలకు ఇందిరమ్మ పథకం ఒక వరంలా మారింది.
ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తా
రాష్ట్రంలోనే కాకుండా మంత్రి నియోజక వర్గంలో ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఇల్లు రాలేదని ఎవరు కూడా ఆందోళన చెందవద్దని, రెండో విడతలో ప్రతి గ్రామంలో పేదవారిని గుర్తించి ఇల్లు లేని నిరుపేదలకు ఇందిర మా ఇల్లు మంజూరు చేస్తామన్నారు.
రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు




