calender_icon.png 3 February, 2026 | 6:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా దరఖాస్తుల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలి

03-02-2026 12:00:00 AM

  1. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్

ఖమ్మం టౌన్, ఫిబ్రవరి 2 (విజయ క్రాంతి): ప్రజల దరఖాస్తులను అధికారులు ప్రాధాన్యత నిచ్చి వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని, ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా చింతకాని మండలం లచ్చగూడెం గ్రామం నుండి డి. సుజాత ఉపాధి కొరకు స్వీపర్ పోస్ట్ ఇప్పించగలందులకు దరఖాస్తు చేయగా, జిల్లా ఉపాధికల్పన అధికారిని తగుచర్యకై కలెక్టర్ ఆదేశించారు.

సత్తుపల్లి మండలం రేజర్ల గ్రామం నుండి గ్రామస్థులు, గ్రామంలోని ప్రభుత్వ భూమి ఆక్రమణ కాకుండా చర్యలకు దరఖాస్తు సమర్పించగా, సత్తుపల్లి తహసీల్దార్ నకు విచారణ చేసి, చర్యలు చేపట్టాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు. స్థానిక పంపింగ్ వెల్ రోడ్ నుండి పిడకల రాంబాయి, తనకు ఇల్లు లేదని, డబల్ బెడ్ రూం ఇల్లు కేటాయించుటకు దరఖాస్తు సమర్పించగా, హౌజింగ్ పిడి ని తగుచర్యకై కలెక్టర్ ఆదేశించారు.

వైరా పట్టణం నుండి ఎస్కె. గాలిబి, తనకు స్థలం ఉందని, తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కు దరఖాస్తు సమర్పించగా, హౌజింగ్ పిడి ని తగుచర్యకై కలెక్టర్ ఆదేశించారు. తిరుమలాయపాలెం మండలం సుబ్లేడ్ గ్రామం నుండి పి. వెంకటమ్మ, తన భర్త ఎల్లయ్య జూన్, 2023 లో మరణించారని, తనకు ప్రభుత్వం నుండి వితంతు పెన్షన్ మంజూరుకు దరఖాస్తు సమర్పించగా, డిఆర్డీవో కు తగుచర్యకై కలెక్టర్ ఆదేశించారు.

అనంతరం వివిధ శాఖల్లో పనిచేసి 31 జనవరి న పదవీ విరమణ చెందిన 7 గురు అధికారులు, సిబ్బందిని కలెక్టర్ సన్మానించి, వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డా. పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిణి ఏ. పద్మశ్రీ, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో కె. శ్రీనివాసరావు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.