calender_icon.png 3 February, 2026 | 4:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

03-02-2026 12:00:00 AM

  1. సమస్యలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు న్యాయం చేకూరుతుందనే  భరోసా కల్పించాలి 

పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన  ఎస్పీ రోహిత్ రాజు

పాల్వంచ, ఫిబ్రవరి 2,(విజయక్రాంతి): పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, సమస్యలతో స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం చేకూరేలా భరోసా కల్పించాలని ఎస్పి రోహిత్ రాజ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

5S అమలులో భాగంగా పోలీస్ స్టేషన్ రికార్డులను ఒక క్రమ పద్దతిలో అమర్చుకోవాలన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించి,పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వర్టికల్స్ వారీగా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించే అధికారులు,సిబ్బంది పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని  అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.

డయల్ 100 ఫోన్ రాగానే స్పందించి ఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం చేకూర్చాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం అక్కడ విధులలో ఉన్న సిబ్బంది సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ సీఐ సతీష్,ఎస్త్స్ర సురేష్, టీజీఎస్పీ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.