12 May, 2026 | 8:54 PM

Breaking News

హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •   నిర్మాణ రంగంలో ముడి సరుకుల ధరలకు అనుగుణంగా నూతన ధరలు చెల్లించండి   •  

ప్రజావాణి వినతుల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలి

30-06-2025 09:54 PM

హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్..

హనుమకొండ (విజయక్రాంతి): ప్రజావాణిలో వచ్చిన వినతులను పరిష్కరించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్(District Collector Sneha Shabarish) అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతులను జిల్లా కలెక్టర్ కు అందజేశారు. ప్రజలు అందించిన వినతులను వెంటనే సంబంధిత శాఖల అధికారులకు పరిష్కారానికి చర్యలు చేపట్టడంపై కలెక్టర్ ఆదేశించారు.

ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు 176 వినతులను అందజేశారు. జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ... ప్రజావాణిలో వచ్చిన వినతులను త్వరగా పరిష్కరించాలన్నారు. వచ్చిన పలు వినతులపై తక్షణమే చర్యలు చేపట్టాలని జిల్లాలోని పలువురు తహసిల్దార్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వై.వి.గణేష్, ఆర్డీవోలు, వివిధ శాఖల జిల్లా అధికారులు, అధికారులు పాల్గొన్నారు.