calender_icon.png 1 July, 2025 | 4:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సొంత నిధులతో రోడ్డుకు ఇరువైపుల కంప చెట్ల తొలగింపు

30-06-2025 09:36:07 PM

వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలం(Valigonda Mandal)లోని మొగిలిపాక గ్రామానికి చెందిన మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు మొగిలిపాక పాపయ్య తన సొంత నిధులతో మొగిలిపాక నుండి తుర్కపల్లి వరకు, సర్వేపల్లి వరకు రోడ్డుకి ఇరువైపుల కంప చెట్లను తొలగించడం జరిగింది. రైతులు బావుల వద్దకి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతుండడంతో గ్రామ యువత స్నేహ యూత్,  భజరంగ్ యూత్ సభ్యులు కోరిక మేరకు ముడు గ్రామలకు వెళ్ళే చెరువుకట్టకి ఇరువైపులా కంప చెట్లను తొలగించడం జరిగిందని పాపయ్య తెలిపారు.

అదేవిధంగా గ్రామంలోని శివాలయంలో ప్రహరి గోడ నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముద్దసాని రామ చంద్రరెడ్డి, ముద్దసాని రఘుపతి రెడ్డి, జయసింహరెడ్డి, జిల్ల నాయకులు మమిడి సత్తిరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు పబ్బు ఎల్లయ్య గౌడ్, జడిగే వెంకన్న, కొండమీది సురేష్, ఎస్.కే. హుస్సేన్, జక్కుల ఐలయ్య, గంట చంద్రయ్య, మర్ల శ్రీశైలం, షేక్ మౌలానా తదితరులు పాల్గొన్నారు.