17 April, 2026 | 2:42 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

మురుగు కష్టాలపై తక్షణ స్పందన

04-11-2025 12:14 AM

మాజీ చైర్మన్‌కు స్థానికుల ఫిర్యాదు.. సిబ్బందికి కస్తూరి నరేందర్ ఆదేశం

మణికొండ, నవంబర్ 3, విజయక్రాంతి : మణికొండ మున్సిపాలిటీ పరిధిలో డ్రైనేజీ లైన్ జామ్ కావడంతో మురుగునీరు రోడ్లపైకి చేరింది. హనుమాన్ నగర్ నుండి పంచవటి కాలనీ వరకు వెళ్లే ప్రధాన రహదారిపై మురుగు పారుతుండటంతో ఇబ్బందిగా ఉందని కాలనీవాసులు మాజీ చైర్మన్ కస్తూరి నరేందర్ దృష్టికి తీసుకెళ్లారు.వెంటనే స్పందించిన నరేందర్ సోమవారం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. మున్సిపల్ సిబ్బందిని పిలిపించి సమస్యను వివరించారు.

ముఖ్యమైన డ్రైనేజ్ లైన్ జామ్‌ను వెంటనే తొలగించి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఇంజనీరింగ్ విభాగాన్ని కోరారు. అనంతరం ఆయన కాలనీవాసులతో మాట్లాడారు. ఆయన వెంట మాజీ కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ, పురుషోత్తం, మాజీ కోఆప్షన్ సభ్యులు అహ్మద్ షా ఖాన్, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ ఉన్నారు.