04-11-2025 12:13:07 AM
							కబ్జాలపై ప్రజావాణిలో ఫిర్యాదు
ఇబ్రహీంపట్నం, నవంబర్ 03: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణిలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరుతూ తెలంగాణ భూముల పరిరక్షణ సమితి ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అధ్యక్షులు మచ్చ జంగయ్య ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మచ్చ జంగయ్య, ఉపాధ్యక్షులు గంటీల వెంకటేష్ మాట్లాడుతూ.. మంచాల మండల పరిధి, ఆగపల్లి గ్రామ సమీపంలోని సర్వే నెంబర్ 191,187 లలో గల ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఏర్పాటు చేసిన ఓ ప్రైవేటు వెంచర్ యజమానిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి కి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.
గతంలో రెవెన్యూ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన తూతూ మంత్రంగా రెండు రోజులు సర్వే చేసి ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి బోర్డు నాటించారు. కానీ ప్రభుత్వ అధికారులను కాదని వెంచర్ నిర్వాహకులు బోర్డుని అక్కడ నుంచి తీసివేయడంతో ఎలాంటి చర్యలు తీసుకోకుండా స్థానిక రెవిన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. వెంచర్ యాజమాన్యంతో కుమ్ముక్కు ప్రభుత్వ భూమి కబ్జా చేస్తున్న ఏం మాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వ భూమిని కాపాడకుండా వెంచర్ యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ప్రభుత్వ భూమిలో నుండి రోడ్డు నిర్మాణానికి సహకరించిన అధికారులపై శాఖ పరమైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం కబ్జాకు గురైన భూమి విలువ మార్కెట్ రేటు ఒక ఎకరం రూ.4 కోట్ల వరకు ఉంటుందని విలువైన భూమిని కాపాడడంలో విఫలమైన స్థానిక అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేని ెుడల మంచాల మండల తహసీల్దార్ కార్యాలయం దగ్గర న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని అన్నారు.