calender_icon.png 6 December, 2024 | 4:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనానికి అనుమతివ్వాలి

13-09-2024 12:21:14 AM

భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి 

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్12(విజయక్రాంతి): గత రెండు సంవత్సరాల మాదిరిగానే ఈ సంవత్సరం కూడా హుస్సేన్ సాగర్(ట్యాంక్‌బండ్)లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనుమతివ్వాలని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి బి.రాజవర్ధన్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ.. 2021 నిబంధనల ప్రకారం పీవోపీ విగ్రహాల తయారీ, నిమజ్జనానికి ప్రభుత్వం అనుమతించిందని చెప్పారు.

కాలుష్య కారకాలకు తామూ వ్యతిరేకమేనని, కానీ పీఓపీ నుంచి మట్టి వినాయకుల తయారీకి కొంత సమ యం పడుతుందన్నారు. ఈ సందర్భంగా బీజేపీ మహిళా నేత మాధవీలత మాట్లాడుతూ.. గతంలో మాదిరిగానే ఈసారి కూడా నిమజ్జనానికి ఎలాంటి ఆటం కం లేకుండా చూడాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విలేకరుల సమావేశంలో హైదరాబాద్ గణేశ్ ఉత్సవ సమితి అధ్యక్షుడు రాఘవరెడ్డి, ప్రతినిధులు కరుడిమాల్, శ్రీనివాస్ వ్యాస్, మహేందర్, శ్రీరామ్‌వ్యాస్, రమేష్, రవిందర్ తదితరులు పాల్గొన్నారు.