calender_icon.png 19 February, 2026 | 7:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్పంచ్ ను వెంటనే అరెస్టు చేయాలి

19-02-2026 05:48:58 PM

నిర్మల్,(విజయక్రాంతి): ఆదివాసి మహిళపై దాడి చేసి అవమానపరిచిన బోరిగాం సర్పంచ్ కి మల్లికార్జున్ అర్జున్ రెడ్డి నీ వెంటనే అరెస్టు చేయాలని తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు వెంకయ్య గారి భూమయ్య డిమాండ్ చేశారు. గురువారం నిర్మల్ లో మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కక్ష పెంచుకున్న సర్పంచ్ అదే గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళపై దాడి చేసి అవమానపరిచారని కులం పేరుతో దూషించారని పేర్కొన్నారు. ఆయనపై పోలీస్ స్టేషన్లో అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు ఇంతవరకు అరెస్టు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 21 లోపు అరెస్ట్ చేయకపోతే డిఎస్పీ కారులోని ముట్టడిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు అర్జున్ లింగన్న లక్ష్మణ్ సాయన్న భీమేష్ మల్లేష్ తదితరులున్నారు