calender_icon.png 19 February, 2026 | 7:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

'డ్రంక్ అండ్ డ్రైవ్'లో 12 మంది పట్టివేత

19-02-2026 05:47:03 PM

రూ.1,22,500 జరిమానా 

సిద్దిపేట క్రైం: సిద్దిపేట ట్రాఫిక్ పోలీసులు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 12 మంది పట్టుబడ్డారని సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. గురువారం వారిని స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కాంతారావు ఎదుట హాజరుపరిచినట్టు చెప్పారు. జడ్జి విచారణ జరిపి 12 మందికి కలిపి రూ.లక్షా 22వేల 5వందలు జరిమానా విధించారని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన ఇద్దరికి రూ.5 వేల చొప్పున జరిమానా విధించారని ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.