19-02-2026 05:50:16 PM
సిద్దిపేట, ఫిబ్రవరి 19 : సిద్దిపేటలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో గురువారం ఉచిత కంటి వైద్య శిబిరం ఆ సంఘం ప్రతినిధులు నిర్వహించారు. హైదరాబాద్ కొంపల్లిలోని సురేఖ కంటి ఆసుపత్రి వైద్యులు సుమారు 40 మందికి కంటి పరీక్షలు చేశారు. మెరుగైన చికిత్స కోసం అయిదుగురిని సురేఖ ఆసుపత్రికి రెఫర్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి జైన సత్యం, ఆర్థిక కార్యదర్శి రామకిష్టయ్య, వివిధ మండలాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.