calender_icon.png 2 January, 2026 | 9:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘భూ భారతి’ని పటిష్ఠంగా అమలు చేయండి

02-01-2026 01:27:24 AM

  1. రైతులకు మెరుగైన సేవలందించాలి:  రేవంత్‌రెడ్డి

తహసీల్దార్స్ అసోసియేషన్ డైరీని ఆవిష్కరించిన సీఎం

రాజేంద్రనగర్, జనవరి 1(విజయక్రాంతి): తెలంగాణ తహసీల్దార్స్ అసోసియే షన్ (టీజీటీఏ) డైరీనీ గురువారం సీఎం రేవంత్‌రెడ్డి ఆయన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ నూతనంగా అమలులోకి వచ్చిన భూభారతి చట్టాన్ని మరింత పకడ్బందీగా అమలు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. భవిష్యత్తులో మరింత బాధ్యతాయుతంగా ప్రజలకు సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.

ఈ సందర్భంగా తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి నేతృత్వంలో టీజీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రాములు తదితరులు సీఎం రేవంత్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు పి రాధ, ప్రధాన కార్యదర్శి రమేష్ పాక, సెక్రటరీ జనరల్స్ పూల్‌సింగ్‌చౌహాన్, సీహెచ్ శ్రీనివాస్, కార్యదర్శి సరిత పాల్గొన్నారు.