02-01-2026 01:26:42 AM
గోడ పత్రిక ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్
జగిత్యాల, జనవరి 1 (విజయ క్రాంతి): జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం - 2026 కార్యక్రమం గురువారం కలెక్టరేట్లో ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై రోడ్డు జాతీయ భద్రత మాసోత్సవం - 2026 గోడ పత్రిక ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రయాణికుల భద్రతతో పాటు తమ స్వంత భద్రత కోసం డ్రైవర్లు, కండక్టర్లు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, రోడ్డు ప్రమాదాలను నివారించడంలో అవగాహన, క్రమశిక్షణ ఎంతో కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు బి.ఎస్. లత, బి. రాజ గౌడ్, జిల్లా రవాణా శాఖ అధికారులు, డిపో మేనేజర్, ఏ.ఎం.టి, డిపో సిబ్బంది పాల్గొన్నారు.