calender_icon.png 2 January, 2026 | 7:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరికలు

02-01-2026 01:28:28 AM

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

చొప్పదండి, జనవరి 1 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీలకు చెందిన సర్పంచులు, నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. గంగాధర మండలం మల్లాపూర్ గ్రామ బిఆర్‌ఎస్ పార్టీ సర్పంచ్ కొలెపాక కవితా మల్లేశం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కరీంనగర్ లోని తన నివాసంలో సర్పంచ్ కవితా మల్లేశం కు ఎమ్మెల్యే కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. చొప్పదండి నియోజకవర్గం లోని ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని తెలిపారు.