27 June, 2026 | 12:52 AM

నల్లగొండ నైట్స్ ఘనవిజయం

27-06-2026 12:11 AM

తెలంగాణ టీ20 లీగ్

హైదరాబాద్, జూన్ 26: తెలంగాణ టీ20 లీగ్‌లో నల్గొండ నైట్స్ భారీ విజయాన్ని అందుకుంది. వరంగల్ వారియ ర్స్‌పై 91 పరుగుల ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. ఓపెనర్ గౌరవ్ రెడ్డి 34 బంతుల్లో 81( 4 ఫోర్లు, 7 సిక్సర్లు), నితీశ్ రెడ్డి 41 బంతుల్లో 81 (9 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. కెప్టెన్ రాహుల్ బుద్ధి (31) , అర్ఫాజ్ అహ్మద్ (33) పరుగులతో దూకుడుగా ఆడారు.

ఆఖర్లో దివేశ్ సింగ్ (18 నాటౌట్) వేగంగా పరుగులు రాబట్టాడు. వరంగల్ బౌలర్లలో అబ్దుల్ మాలిక్ 2.. ముదాస్సర్, శౌనక్ చెరో వికెట్ తీశారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో వరంగల్ 14 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ అమన్ రావు (46), మురుగన్ అభిషేక్ (44), భవేశ్ సేథ్ (22) దూకుడుగా ఆడారు. అయితే, మిగతా బ్యాటర్లలో హర్షిత్ చౌధరి (10), మణి కిరణ్ (16), అసిఫ్ (5), శౌనక్ (4), ముదాస్సర్ (5), పల్లెపాటి క్రాంతి (5) విఫలమయ్యారు.