12 March, 2026 | 6:51 AM

ఆకట్టుకున్న ఆర్‌ఎస్‌ఎస్ కవాతు

05-11-2025 12:00 AM

నిర్మల్, నవంబర్ 4 (విజయ క్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో మంగళవారం ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వ హించిన ర్యాలీ ఆకట్టుకుంది. పట్టణంలోని దేవరకోట ప్రియదర్శినగర్ శివాజీ చౌక్ ప్రాంతాల నుంచి వేలాది కార్యకర్తలు పట్టణంలో కవాతు  నిర్వహించారు. ఆర్‌ఎస్‌ఎస్ సంచాలన్ పథక్ ప్రచారకులు శ్రీరాం భరత్,  నిర్వాహకులు మల్లేష్ కుమార్, డాక్టర్ ప్రమోద్, చంద్రారెడ్డి, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడి,్డ అదిలాబాద్ ఎంపీ జి నాగేష్ తదితరులు పాల్గొన్నారు.