calender_icon.png 5 November, 2025 | 8:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారును ఢీ కొట్టిన లారీ

05-11-2025 12:00:00 AM

పలువురికి గాయాలు 

అచ్చంపేట, నవంబర్ 04: కారును లారీ ఢీకొట్టిన సంఘటనలో పలువురు గాయపడ్డారు. వివ రాలు ఇలా.. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటకు చెం దిన ఒక కుటుంబం మంగళవారం తమ కారులో హైదరాబాద్ కు బయలుదేరారు. వీరు ప్రయాణిస్తు న్న కారును హైదరాబాదు శ్రీశైలం ప్రధాన రహదారిపై.. చెన్నారం గేటు సమీపంలో చెన్నారం నుంచి ప్రధాన రహదారిపైకి వస్తున్న లారీ గమనించకుండా బలంగా ఢీకొట్టింది.

దీంతో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయింది. అందులోని కొంత లారీ ముందు ప్రాంతంలో ఇరుక్కుపోయింది. కారులో ప్రయాణిస్తున్న రామచంద్రమ్మ, జియా, ఆనంద తీవ్రంగా గాయపడ్డారు. క్షత గాత్రులను చికిత్స కోసం హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఘటన స్థలికి పోలీసులు చేరుకొని వివరాలను నమోదు చేసుకున్నారు. ప్రమాదానికి కారణమైన లారీని, ధ్వంసమైన కారును పోలీస్ స్టేషన్కు తరలించామని అచ్చంపేట ఎస్త్స్ర సద్దాం హుస్సేన్ చెప్పారు. ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదనితెలిపారు.