calender_icon.png 10 November, 2025 | 4:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంజీఎం హాస్పిటల్‌లో సౌకర్యాలు మెరుగుపరచండి

10-11-2025 02:11:00 PM

హన్మకొండ,(విజయక్రాంతి): ఉత్తర తెలంగాణలో పేదలకి వైద్య సేవలు అందించే ఎంజిఎం హాస్పిటల్ లో సౌకర్యాలు మెరుగుపరచాలని ప్రజావేదిక రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు ఎంజీఎం సూపరిండెంట్ కి విజ్ఞప్తి చేశారు. సూపరిండెంట్ ని చాంబర్ లో కలిసిన సందర్భంగా డాక్టర్ శేషు మాట్లాడుతూ... ఎంజిఎం హాస్పిటల్ లో పేద రోగులకి సరైన వైద్య సదుపాయాలు అందటం లేదని వస్తున్న వార్తా కథనాలు ఆందోళన కలిగిస్తున్నాయని తెలియజేశారు. డాక్టర్లు నర్సింగ్ స్టాఫ్ కొరతగా ఉండటం ల్యాబ్ సౌకర్యాలు టెక్నీషియన్లు మందులు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడం వలన రోగులు తీవ్రమైన అసౌకర్యానికి గురవుతున్నారు.

కాబట్టి సూపరిండెంట్ చొరవ తీసుకొని ఎంజీఎం లో పరిణామాలను పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. హాస్పిటల్ లో ఉద్యోగులు సమయపాలన పాటించకపోవడం అవినీతి ఆరోపణలతో ఎంజీఎం ప్రతిష్ట దెబ్బతింటుందని అన్నారు. ఎంజీఎం హాస్పిటల్ పై కలెక్టర్ ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టి సారించి హాస్పిటల్ లో సౌకర్యాలు మెరుగుపరిచే విధంగా చర్యలు చేపట్టాలని అభిప్రాయపడినారు. కలెక్టర్ చొరవ తీసుకొని ఎంజీఎం డెవలప్మెంట్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసినారు. ఈ కార్యక్రమంలో సామాజికవేత్త డాక్టర్ పాలడుగుల సురేందర్, విజయ్ కుమార్, కుమార్ స్వామి తదితరులు పాల్గొన్నారు.