10-11-2025 02:44:07 PM
అనర్హతపై సుప్రీంకోర్టే నిర్ణయం తీసుకోవాలి: కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేశారు. అనర్హతపై సుప్రీంకోర్టే నిర్ణయం తీసుకోవాలని కేటీఆర్ పిటిషన్ లో కోరారు. సుప్రీంకోర్టు విధించిన మూడు నెలల గడువు పూర్తయిందని కేటీఆర్ సూచించారు. గడువు పూర్తయినా తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్(Telangana Speaker Gaddam Prasad) ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేటీఆర్ తెలిపారు. స్పీకర్ నిర్ణయం తీసుకోనందున కోర్టే నిర్ణయం తీసుకోవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. న్యాయవాది మోహిత్ రావు(Advocate Mohit Rao) కేటీఆర్ పిటిషన్ ను సీజేఐ వద్ద మెన్షన్ చేశారు. కేటీఆర్ ఇప్పటికే కోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలు చేశారు. రెండు పిటిషన్లను కలిపి విచారణకు స్వీకరించాలని న్యాయవాది సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. విచారణ ప్రక్రియను మొదలు పెట్టినట్లు స్పీకర్ ఇప్పటికే సుప్రీంకోర్టుకు తెలిపారు. ప్రక్రియ పూర్తికి మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. స్పీకర్ దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చే అవకాశముంది.