10-11-2025 03:45:27 PM
ఇద్దరు వ్యక్తులు అరెస్టు, రిమాండ్ కు తరలింపు
ఎక్సైజ్ జిల్లా అధికారి సుధాకర్
కోయిలకొండ: నిషేధించబడిన గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరిగిందని జిల్లా ఎక్సైజ్ అధికారి సుధాకర్ అన్నారు. సోమవారం ఎక్సైజ్ శాఖ జిల్లా అధికారి సుధాకర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ కవిత ఆధ్వర్యంలో కోయిలకొండ మండలం గార్లపాడ్ సమీపంలో తనిఖీలు చేస్తుండగా ద్విచక్ర వాహనం నెంబర్ టీఎస్ 06ఈవీ 7961 పై ఇద్దరు వ్యక్తులు 200 గ్రాముల గంజాయి తరలిస్తు పట్టు పడ్డారు. ద్విచక్ర వాహనం, రెండు ఫోన్ల ను స్వాధీనం చేసుకున్నాం. పట్టుబడిన నాగనోళ్ల హన్మప్ప, చిన్నా రాజు లను కోర్టు లో హాజరపరచగా వారిని రిమాండ్ తరలించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ దాడులలో ఎస్సై రాజేందర్, సిబ్బంది రియాజ్, రాఘవేందర్, ఏలియా, బాలయ్య తదితరులు ఉన్నారు. మత్తు పద్ధతులను ఎవరు తీసుకోకూడదని పేర్కొన్నారు. హానికరమని ప్రజలకు పూర్తిస్థాయిలో అవగతం చేయడం జరుగుతుందని అవేమి పట్టించుకోకుండా మాదకద్రవ్యాలను తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.