మెరుగైన రవాణా సౌకర్యాలు
- ప్రజల కోసం తేవడమే ప్రభుత్వ లక్ష్యం
- మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
- కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రహదారి అభివృద్ధి పనుల పరిశీలన
కుత్బుల్లాపూర్, జూలై 27(విజయక్రాంతి): కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు తీసుకు రావడమే ప్రభుత్వ లక్ష్యమని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని కొంపల్లి,- బహదూర్‌పల్లి, గండిమైసమ్మ, మియాపూర్ రహదారి నిర్మాణానికి దాదాపు రూ.270 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను సోమవారం ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత దశాబ్ద కాలంగా అటవీ శాఖ అనుమతులు లభించక ఈ రహదారి పనులు నిలి చిపోయాయని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన అనంతరం అవసరమైన అనుమతులు వేగంగా సాధించి పనులు ప్రారంభించిన ట్లు పేర్కొన్నారు. రహదారి నిర్మాణ పనులను నాణ్యతా ప్రమా ణాలతో నిర్నీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అటవీ శాఖ, ఇతర సంబంధిత విభాగాలు పరస్పర సమన్వయంతో పనిచేసి పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఈ అభివృద్ధి పనులు పూర్తయిన అనంతరం కొం పల్లి, బహదూర్ పల్లి, గండిమైసమ్మ, బాచుపల్లి, మియాపూర్ ప్రాంతాల మధ్య ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గడంతో పాటు ప్రజలకు వేగవంతమైన, సురక్షితమైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్‌రావు, కలెక్టర్ మను చౌదరి, సీఎంసీ కమిషనర్ సృజన, కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి, పీసీసీ ప్రోటోకాల్ వైస్ చైర్మన్ బొంగునూరి కిషోర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆర్. లక్ష్మీ, టీపీసీసీ మహిళా ఉపాధ్యక్షురాలు గంగుల అంజలి యాదవ్, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.






