16 April, 2026 | 9:21 AM

ద్విభాషా చిత్రంలో..

16-11-2025 12:00 AM

కోలీవుడ్‌లో రీసెంట్‌గా ‘జో’ అంటూ బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించిన నిర్మాణ సంస్థ విజన్ సినిమా హౌస్. ఈ సంస్థ మరో ప్రాజెక్టును పట్టాలెక్కించింది. తెలుగు, -తమిళ ద్విభాషా చిత్రంగా రూపుదిద్దుకుంటోందీ సినిమా. ‘కోజిపన్నై చెల్లదురై’, ‘కానా కానమ్ కాలంగల్’ వంటి చిత్రాల్లో అద్భుత నటనతో ఆకట్టుకున్న ఏగన్, ‘కోర్ట్’ చిత్రంతో మెప్పించిన శ్రీదేవీ, ‘మిన్నల్ మురళి’ ఫేమ్ ఫెమినా జార్జ్ ఈ చిత్రంలో ముఖ్యపాత్రలను పోషించనున్నారు.

ఈ చిత్రాన్ని మేకర్స్ శనివారం అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఆయన ఇటీవల ‘బేబీ’, ‘కోర్ట్’ సినిమాలకు సంగీతం అందించడం ద్వారా వరుస హిట్లను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ‘ఆహా కళ్యాణం’ ఫేమ్ డైరెక్టర్ యువరాజ్ చిన్నసామి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ‘జో’ విజయం తర్వాత మంచి సబ్జెక్ట్, కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాల్ని అందించాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్న విజన్ సినిమా హౌస్ నిర్మాతలు డాక్టర్ డీ అరుళనందు, మాథ్యూయో అరుళనందు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలనున త్వరలో ప్రకటించనున్నారు.