calender_icon.png 19 November, 2025 | 11:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సావిత్రి, శ్రీదేవి స్ఫూర్తితో కాంత పాత్ర చేయగలిగా..

16-11-2025 12:00:00 AM

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన తాజాచిత్రం ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రానా, సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు. నవంబర్ 14 విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. తమ సినిమాకు మంచి స్పందన వస్తోందంటూ రానా, భాగ్యశ్రీ శనివారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో చెప్పారు. ఇంకా ఈ సమావేశంలో రానా మాట్లాడుతూ.. “కాంత’ జోనర్ బెండింగ్ సినిమాగా వచ్చిన ఫస్ట్ చిత్రం.

ఈ సినిమా చేసినందుకు చాలా గర్వంగా ఉంది. ‘ఇది బయోపిక్ కాదు. అయితే 50, 60 దశకాల్లో నుంచి తీసుకున్న సినిమాల రిఫరెన్సులు ఇందులో చూపించాం. ఆ టైమ్‌కి సంబంధించిన కథ కాబట్టే ఇందులో ఎంజీఆర్, ఎంఆర్ రాజా లాంటి ప్రము ఖ నటుల్ని చూపించాల్సి వచ్చింది” అని చెప్పారు.  భాగ్యశ్రీ మాట్లాడుతూ.. “ఇది నా తొలి తమిళ్ సినిమా. ఈ అవకాశం రావడమనేది అదృష్టంగా భావిస్తున్నా. ఇంత మంచి అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా 100 శాతం దృష్టి సారిం చాలి. డైరెక్టర్ సెల్వ ప్రోత్సాహంతో ప్రతి లైన్‌నున క్షుణ్ణంగా నేర్చుకున్నా. ద బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించా.

ఈ సినిమా కోసం ఆరు నెలలు చెన్నైలోనే ఉన్నా. ఈ సినిమాలో నేను నటించిన ‘కుమారి’ పాత్ర కోసం సావిత్రి, శ్రీదేవి చేసిన చాలా సినిమాలు చూశాను. నాకూ చిన్నప్పట్నుంచి సినిమాలంటే ఇష్టం. అందులోనూ పాత సినిమాలంటే ఇంకా ఇష్టం. అవన్నీ దీనికి ఉపయోగపడ్డాయి. వరుసగా రెండు వారాల్లో నేను నటించిన రెండు సినిమాలు వస్తున్నాయి. అది యాదృచ్చికం. -చాలా హ్యాపీగా ఉంది. ఈ రెండిటి నేపథ్యం సినిమా అయినప్పటికీ కథ పరంగా దేనికవి ప్రత్యేకమైన చిత్రాలు” అని తెలిపింది.