13 July, 2026 | 9:40 PM

Breaking News

నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •  

అల్లు అర్జున్‌తో తలపడే పాత్రలో..!

08-02-2026 12:55 AM

దక్షిణాది స్టార్స్ అల్లు అర్జున్, అట్లీ కాంబోలో ఓ భారీ బడ్జెట్ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘ఏఏ22’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె మెయిన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాను రెండు భాగాలుగా విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ ఇందులో మల్టిపుల్ రోల్స్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు ముంబైలో శరవేగంగా జరుపుకుంటోంది. ఇటీవల ప్రారంభమైన ఈ షెడ్యూల్‌లో రష్మిక మందన్న అడుగుపెట్టింది.

ముంబయి షెడ్యూల్‌లో భాగంగా రష్మిక ప్రస్తుతం తన సోలో సీన్ల షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ పూరి కాగానే అల్లు అర్జున్, జాన్వీ కపూర్, ‘కుబేర’ ఫేమ్ జిమ్ సర్భ్‌లతో కలిసి కీలక సన్నివేశాల్లో రష్మిక పాల్గొననుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో రష్మిక పాత్ర గురించి ఫిలింనగర్ సర్కిళ్లలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆమె నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతోందని సమాచారం. ఇప్పటివరకు తన కెరీర్‌లో ఎక్కువగా సాఫ్ట్ రోల్స్ చేసిన రష్మిక తొలిసారిగా అల్లు అర్జున్ను ఢీకొట్టే శక్తిమంతమైన ప్రతినాయికగా నటిస్తోందని టాక్. ‘పుష్ప’ సిరీస్‌లో జోడీగా అలరించిన బన్నీ ఈ జంట ఇప్పుడు ఒకరికొకరు ప్రత్యర్థులుగా తలపడనున్నారనే వార్త అభిమానుల్లో అమితాసక్తిని రేకెత్తిస్తోంది.