24 June, 2026 | 2:11 AM

మత్తు పదార్థాలు, మానవ అక్రమ రవాణాపై విద్యార్థినులకు అవగాహన

24-06-2026 01:15 AM

వనపర్తి మండలం, జూన్ 23: వనపర్తి బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల వ్యతిరేకత, మానవ అక్రమ రవాణాపై అవగాహన సదస్సు నిర్వహించారు. పోలీస్ శాఖ, షీ టీం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ప్రిన్సిపల్ పి. ఆనంద్ అధ్యక్షత వహించారు.

జిల్లా డీఎస్పీ బాలాజీ నాయక్ పాల్గొని విద్యార్థినులకు మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలు, మానవ అక్రమ రవాణా ప్రమాదాలపై అవగాహన కల్పించారు. విద్యార్థినులు అప్రమత్తంగా ఉండి ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం మత్తు వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ టి. యాదగిరి, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.