calender_icon.png 11 November, 2025 | 5:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి

11-11-2025 04:16:16 PM

నివాళులు అర్పించిన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): స్వాతంత్ర సమర యోధుడు, భారత దేశ తొలి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భారత దేశ తొలి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకల కార్యక్రమాన్ని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించగా, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై  కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్ర పటానికి ఇంచార్జి కలెక్టర్ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో, దేశ విద్యా వ్యవస్థ నిర్మాణంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ అందించిన సేవలను కొనియాడారు.ఇక్కడ మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి భారతి, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.