calender_icon.png 11 November, 2025 | 5:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొక్కలతోనే మానవాళి మనుగడ

11-11-2025 03:44:04 PM

సదా సేవ ఆర్గనైజేషన్ అధ్యక్షులు సంగి సంతోష్

మందమర్రి,(విజయక్రాంతి): మొక్కలతోనే మానవాళి మనుగడ ఆధారపడి ఉంటుందని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సదా సేవా ఆర్గనైజేషన్ అధ్యక్షులు సంగి సంతోష్ కోరారు. సదా సేవ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన వృక్షో రక్షిత రక్షితః కార్యక్రమంలో భాగంగా 55వ రోజు మంగళవారం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో విజయక్రాంతి విలేఖరి విజయ్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు సంతోష్ మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా సంస్థ ఆధ్వర్యంలో నిర్విరామంగా మొక్కలు నాటే కార్యక్రమం యజ్ఞంగా చేపట్టడం జరిగిందన్నారు.

మొక్కలు నాటి సంరక్షించడం ద్వారా పర్యావరణం కలుషితం కాకుండా ఉంటుందని స్వచ్ఛమైన వాతావరణం, గాలి మొక్కల తోనే సాధ్యమవుతుందన్నారు. మొక్కలు నాటి సంరక్షించడం ద్వారా పర్యావరణం కాలుష్యం బారిన పడకుండా ఉండటమే కాకుండా వర్షాలు సమృద్ధిగా కురిసి భూగర్భ జలమట్టం పెంపొందుతుందని అంతే కాకుండా పంటల సాగు విస్తీర్ణం పెరుగుతుందన్నారు. వీటన్నిoటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు ఎండి సలామొద్దీన్  పాల్గొన్నారు