11-11-2025 04:21:48 PM
- చట్టపకారం ఎక్కడ కూడా ఆర్ అండ్ ఆర్ కాలనీలు కట్టించలేదు
- 18 సంవత్సరాలు నిండిన వారికి పరిహారం అందించాలి
- డిమాండ్లను నెరవేర్చని యెడల ఇక్కడ యువతతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే కార్యాచరణ చేస్తాం
- తెలంగాణ జాగృతి పార్టీ ఫౌండర్ కల్వకుంట్ల కవిత
మునుగోడు,(విజయక్రాంతి): డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తైతే వేలాది మందికి లాభం చేకూరుతుందనే ఉద్దేశంతో ఈ ప్రాంతం చుట్టు పక్కల ప్రజలు తమ భూములను ఇచ్చారని, అప్పుడున్న ధరలకు ఇప్పుడున్న ధరలకు పోలిస్తే ప్రాజెక్టు భూనిర్వాసితుల కళ్ళలో నీరు కాదు. రక్తం పారుతుందని తెలంగాణ జాగృతి పార్టీ వ్యవస్థాపకరాలు కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం జాగృతి జనం బాటలో భాగంగా నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలోని డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలోని కిష్టరాయినిపల్లి, లక్ష్మణాపురం, శివన్నగూడెం రిజర్వాయర్లను సందర్శించి నిర్వాసితులను కలిసి మాట్లాడారు.
2015లోనే తొందరగా ప్రాజెక్ట్ పూర్తై ఉంటే సమస్యలు ఉండకపోయేవి అని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 11 ఏళ్లు ఆలస్యమైంది. దీంతో అప్పుడు 18 ఏళ్లు నిండని చాలా మందికి ఇప్పుడు 18 ఏళ్లు దాటాయి. వారికి కూడా పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని గుర్తు చేశారు. చట్ట ప్రకారం నిర్వాసితులకు ఇళ్లు గానీ వేరే కాలనీలు గానీ కట్టించలేదు,2013 చట్టం ప్రకారం భూసేకరణ జరిగింది. అందులో ఇళ్ళు,కొన్ని చోట్ల వివరాలు పూర్తిగా సేకరించబడలేదు. రాబోయే 3,4,5 సంవత్సరాలలో 18 సంవత్సరాలలో ఉన్న వారందరికీ పరిహారం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు.
అప్పట్లో ప్రాజెక్ట్ భూమికి 4 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు అది 11 సంవత్సరాలు అయింది,దానిని పెంచడం అవసరం ఉందని అన్నారు. గ్రామస్తులను పిలిచి వారితో చర్చించండి,రాజగోపాల్ రెడ్డి చెప్పినట్లుగా, మేము 25 నుండి30 లక్షలు అడగలేము. ఆ రోజు వారు 4 నుండి5 లక్షలు ఇచ్చారు. గరిష్టంగా కొంతమందికి 7.5 లక్షలు ఇచ్చారు. కానీ ప్రస్తుత రేట్లను పరిశీలిస్తే, ఇక్కడి ప్రజల కళ్ళ నుండి నీరు రాదు, వారు రక్తస్రావం అవుతున్నారు.ఇప్పుడు 80% గ్రామస్తులు ఆయా గ్రామాలను ఖాళీ చేసి వెళ్లారు.
మరికొన్ని గ్రామాలు ఇప్పటికీ ఉపయోగంలో ఉన్నాయి.ఎవరు ఆర్ అండ్ ఆర్ కాలనీని నిర్మించలేదు. గ్రామాన్ని మరొక గ్రామానికి మార్చడం ప్రధాన మానవ హక్కు,గ్రామం ఇప్పుడు చెట్లతో నిండి ఉంది. ఇబ్రహీంపట్నం,చింతపల్లిలోని కొంతమంది నివసించడానికి స్థలం అడుగుతున్నారు. ఒక కాలనీ లాగా, వారికి 10, 20, ఎకరాల స్థలం కేటాయిస్తే భూ నిర్వాసితులకు అందరికీ అనుకూలంగా ఉంటుందని అన్నారు.ప్రభుత్వం వెంటనే నిర్వాసితులకు తగిన పరిహారం ఇవ్వాలినీ,లేదంటే ఇక్కడ యువతతో కలిసి హైదరాబాద్ లో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే కార్యాచరణ చేస్తాం అని డిమాండ్ చేశారు.