5 May, 2026 | 7:26 AM

అమరులకు గుర్తుగా.. త్యాగాల చౌక్

24-12-2024 12:00 AM

తెలంగాణ ప్రాంతం కోసం పోరాటాలు చేసి అమరులైన వీరులకు తెలంగాణ ఉద్యమ సమయంలో తగిన గుర్తింపు వచ్చింది నిర్మల్ జిల్లాలోనే అని చెప్పాలి. మలి దశ ఉద్యమంలో భాగంగా 2001 నుండి 2014 వరకు వివిధ దశల్లో జరిగిన ఉద్యమాలు జరిగాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ నాయ కత్వంలో జేఏసీ పిలుపు మేరకు అన్ని ఉద్యమాలు అమలు చేసేది.

దీనికి రాజకీయ పా ర్టీలతో పాటు, ఉద్యోగులు, వైద్యులు, కవు లు, కళాకారులు, కుల సంఘాలు, కార్మిక సంఘాలు, విద్యార్థి, వ్యాపార సంఘాలు ఏకతాటిపైకి వచ్చి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాయి. నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ముందు సకల జనుల సమ్మెను 42 రోజుల పాటు నిర్వహించారు. రాస్తారోకోలు, మానవహారం, రైల్‌రోకో, వంటా వార్పు, చలో మిలియన్ మార్చ్, తెలంగాణ ధూంధాంలు తదితర కార్యాక్రమాలను నిర్వహించారు. 

2011 నుండి తెలంగాణలో ఐకాస ఆధ్వర్యంలో సంఘటితంగా ఉద్యమాలు జరిగాయి. అయితే నిర్మల్ ఉద్యమకారులు తెలంగాణ ప్రాంతం ప్రజల కోసం పోరాడిన వీరులను స్మరించుకొంటూ నిర్మల్‌లో త్యాగ వీరులు స్మారక చిహ్నాలు ఏర్పాటు చేశారు. నిర్మల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు ఆర్డీవో కార్యాలయం ప్రక్కన అమర వీరుల త్యాగాలను స్మరించుకుంటూ దీక్షలు చేసేది. మొదటగా నిర్మల్‌లో రాంజీ గోండు, కుమ్రం భీం, చాకలి ఐలమ్మ, తెలంగాణ అమరవీరులు, సర్ధార్ పాపన్న గౌడ్ తదితర స్మారక చిహ్నాలు ఏర్పాటు చేశారు.

వీటిని ప్రొఫెసర్ కోదండారాం, ఇతర ఉద్యమ నేతలు ప్రారంభించారు. దీనికి కుల సంఘాలు, ఉద్యమ సంఘాలు, ఉద్యోగులు వ్యాపారులు, స్వచ్ఛందగా ముందకు వచ్చి సహాకారం అందించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లోనే నిర్మల్ కేంద్రంగా ఉద్యమం మరింత బలపడింది. నాలుగు సంవత్సరాల్లో  ఆరు చిహ్నాలు ఏర్పాటు చేశారు. అమరవీరుల స్థూపాలను ఏర్పాటు చేయడం వల్ల దాన్ని త్యాగాల చౌక్‌గా నామకరణం చేశారు. ఈ స్మారక చినహ్నాలకు నివాళులు అర్పించిన తర్వాతే ధర్నాలు చేసేది. ప్రస్తుతం అక్కడ 30 అడుగుల సర్ధార్ పాపన్న గౌడ్ విగ్రహం, 25 అడగులు తెలంగాణ కోసం అమరులై అమరవీరుల స్మరక స్థూపం, చాకలి ఐలమ్మ, రాంజీగోడు, కుమ్రం భీం విగ్రహాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో స్థూపాలను నిర్మించుకోవడం చారిత్రత్మకం. 

పోరాటాలకు అడ్డా.. 

తెలంగాణ కోసం అమరులైన వారికి గుర్తింపుగా నిర్మల్‌లో నాలుగేళ్లల్లో ఆరు చిహ్నాలు ఏర్పాటు చేశారు. దీనివల్ల  పోరాటాలకు అడ్డాగా మరింది. నిర్మల్‌లో ఏ ఉద్యమం జరిగిన నిరసలు నిర్వహించేది  ఈ కూడలి నుంచే. మలిదశ ఉద్యమంలో ఏర్పాటు చేసిన స్మారక చిహ్నాలు ఎప్పటికీ గుర్తు ఉండిపోయేలా ఉన్నాయి. ఉద్యమకారుల చరిత్ర ప్రతిఒక్కరు తెలుసుకుంటారు. 

 -డాక్టర్ కృష్టం రాజు, ఉద్యమకారుడు

పోరాట స్ఫూర్తిని చాటి చెప్పేందుకు!

నిర్మల్‌లో తెలంగాణ రెండవ దశ ఉద్యమంలో తెలంగాణ గౌడ జనుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జేఏసి ఉద్యమాల్లో  పాల్గొన్నాం. రాష్ట్ర కన్వీనర్‌గా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను చైతన్యం చేశాం. తెలంగాణ వస్తేనే కుల వృత్తులు బాగుపడతాయని ప్రజలకు వివరించాం. అప్పట్లో నిర్మల్‌లో నిజాం నిరంకుశ పాలనపై పోరాటం  చేసిన సర్ధార్ పాపాన్న గౌడ్, అమరవీరల స్మారక చిహ్నాలు నిర్మించేందుకు ఎన్నో నిర్బంధాలు ఎదురైన ఉద్యమకారుల సహకారంలో అమరవీరుల స్థూపాలను ఏర్పాటు చేశాం. 

 -అమరవేణి నర్సాగౌడ్