5 May, 2026 | 2:08 AM

‘మంజీరా’ పై.. ‘ఇసుక’ మాఫియా దాడి..

05-05-2026 12:41 AM
  1. నిబంధనలు ‘తుంగ’లో తొక్కి... అక్రమ తవ్వకాలు..
  2. అధికార పార్టీ నేతల హస్తంతో రెచ్చిపోతున్న మాఫియా..
  3. రెవెన్యూ, పోలీస్, మైనింగ్ శాఖల అధికారుల మిలాఖత్..
  4. భారీగా ముడుపులు..మాఫియాకు అందలం..
  5. అడుగంటిపోతున్న భూగర్భ జలాలు.. రైతన్నల పాలిట శాపం..
  6. నిజామాబాద్ జిల్లా పోతంగల్ ఇసుక క్వారీలో అంతా ఇష్టారాజ్యం..
  7. కన్నెత్తి చూడని మైనింగ్ శాఖ అధికారులు..

బాన్సువాడ, మే 4 (విజయక్రాంతి): మంజీరాపై ఇసుక మాఫియా దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అంతా మా ఇష్టం అంటూ విచ్చలవిడిగా నిబంధనలను తుంగలో తొక్కి అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపడుతూ మూడు పూవులు ఆరు కాయలుగా దందాను కొనసాగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు అటు రెవెన్యూ పోలీస్ మైనింగ్ శాఖ అధికారులతో నిలాకర్ చేసుకొని అధికార పార్టీ నేతల అండదండలతో ఇసుక మాఫియా రెచ్చిపోతూ రాత్రి పగలు తేడా లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేపడుతున్నారు.

అన్నదాతలు తమ పంటలకు సాగునీరు అందక పొలాలు ఎడారుగా మారే పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ ప్రభుత్వానికి ఆదాయం కోసం రైతుల పొట్ట కొడుతున్నారు. ఈ ఇసుక దందాలో అధికార పార్టీకి చెందిన కొంతమంది నేతలు ఇసుక మాఫియాలో ఆరితేరి ఉన్న వ్యక్తులు ఈ అక్రమ దందా కొనసాగిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండల కేంద్రంలోని ఇసుక నిర్వాహకుల మాఫియా ముఠాల రాజ్యమేలుతుంది. 2021 లో కామారెడ్డి జిల్లా మంజీరా నదిలో చెక్ డాం పేరిట ఇసుక క్వారీలు ఐదేళ్లపాటు విచ్చలవిడిగా కొనసాగించి కోట్లు దండుకున్నారు.

ఇప్పుడు ఇదే మాఫియా పొతంగల్ మంజీరా నదిలో పడ్డారు. నెల రోజులుగా ఖనజ అభివృద్ధి సమస్త ఆధ్వర్యంలో పొతంగల్ మంజీరా నదిలో ఇసుక క్వారీ కొనసాగుతుంది. ఈ క్వారీలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు త్రవ్వకాలు, రవాణా కొనసాగాలి. మంజీరా నదిలో ఇసుక త్రవ్వకాలు జరుపకూడదని నిబంధనలు ఉన్నాయి. కానీ కొంతమంది రెవెన్యూ, పోలీస్ శాఖ, ఆర్టీవో శాఖ, ముడుపులు , అధికార పార్టీ నాయకులకు జేబులు పగలు రాత్రి అనే తేడా లేకుండా ఇసుక దోపిడీ కొనసాగుతుంది.

విచ్చలవిడిగా అక్రమ ఇసుక రవాణా జరుగుతూ ఉన్నప్పటికీ అటు అధికార పార్టీ నేతలు ఎటు రెవెన్యూ పోలీస్ మైనింగ్ శాఖ అధికారులు కుమ్మక్కై ఇసుక మాఫియా కు వత్తాసు పలుకుతూ దంధాలు ఏదేచ్ఛగా కొనసాగిస్తున్న ఉన్నారు. ఇదిలా ఉంటే ఇసుక మాఫియా ఉన్నతాధికారులకు భారీగా ముడుపులు చెల్లించి దండను ఇష్టారాజ్యంగా రాత్రి పగలు తేడా లేకుండా కొనసాగిస్తున్నారు. అటు టిప్పర్లు పెద్ద పెద్ద లారీలలో పతంగల్ నుండి మహారాష్ట్ర హైదరాబాద్ నగర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తూ దండుకుంటున్నారు. అక్రమ ఇసుక రవాణా వలన మంజీరా నదిలో భూగర్భ జలాలు అడుగంటిపోయి రైతన్నల పాలిట శాపంగా మారిందని రైతన్నలు వాపోతున్నారు.

అంతేకాకుండా భవిష్యత్ తరాల్లో సాగునీరు అందక రైతన్నలు తీరంగ నష్టపోయే పరిస్థితి నెలకొంటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గత కొన్ని రోజులుగా టిప్పర్ల తో అక్రమంగా ఇసుక తరలిపోతున్న అన్న విషయంపై పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్యకు గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో, నిబంధనలకు విరుద్ధంగా రాత్రిపూట ఇసుక తరలిపోతుంటే నిద్రపోతున్నారా అంటూ కోటగిరి ఎస్త్స్ర తో పాటు సిబ్బందిపై మండిపడ్డట్లు తెలుస్తుంది. ఇసుక రవాణాలో ఎవరైనా లాలూచీపడి డబ్బులు దండుకుంటే వారిపై కఠినంగా శిక్షిస్తామని సిపి హెచ్చరించారు.

ఇదిలా ఉంటే బాన్సువాడ మొదలుకొని సాలూర వరకు మంజీరా నది పర్యాయక ప్రాంతాల్లో 50 వేల ఎకరాల భూమి సాగుతుంది. వీటిలో మంజీరా నదిలో బోర్లు వేసుకొని కొంతమంది వేసుకొని పంటలు పండించుకుంటున్నారు. మరి కొందరు ఎత్తిపోతల పథకాల కింద పంటలు సాగవుతున్నాయి. మరి కొన్ని చోట్ల మంచినీటి సౌకర్యం కోసం బోర్లు వేశారు. ప్రస్తుతం పొతంగల్ బ్రిడ్జి వద్దనే ఇసుక విచ్చలవిడిగా త్రవ్వేస్తున్నారు. దీనివల్ల మంజీరా నది పర్యాయక ప్రాంతంలో ఈ వానకాలం ఆశించిన రీతిలో వర్షాలు పడకుంటే రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారే పరిస్థితి నెలకొంది.

ఇసుక క్వారీ ద్వారా రవాణా అవుతున్న ఇసుక నుంచి గ్రామ పంచాయతీలకు సీనర్జీ డబ్బులు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా పొత్తంగల్ గ్రామపంచాయతీలో జమ కాలేదు. 50 శాతం వచ్చిన ఆదాయం నుంచి గ్రామపంచాయతీ ఖాతాలో నిధులు జమ కావాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఉష్ణ మాఫియా పట్టించుకున్న పాపాన పోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అక్రమంగా తరలిపోతున్న ఇసుకను అరికట్టి భూగర్భ జలాలు అడుగంటకుండా మైనింగ్ శాఖ రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులు ఉమ్మడిగా దాడులు చేపట్టి అక్రమ ఇసుక రావణాన్ని అరికట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

నిబంధనలు తుంగలో..

పోతంగల్ ఇసుక క్వారీలో విచ్చలవిడిగా అక్రమ ఇసుక తవ్వకాలు చేపడుతూ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఉష్కా రవాణా చేయాల్సి ఉన్నప్పటికీ అర్ధరాత్రి తెల్లవారుజామున తేడా లేకుండా ఇసుక రవాణా అక్రమంగా సాగిస్తూ మూడు పూవులు ఆరు కాయలుగా ఇసుక మాఫియా దందాను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు ఏమాత్రం పట్టించుకోకుండా అటు రెవెన్యూ పోలీస్ మైనింగ్ శాఖ అధికారులతో కుమ్మక్కై ఇసుక మాఫియా అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి అక్రమ రవాణా ను అరికట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

భారీగా ముడుపులు.. యధేచ్చగా రవాణా..

అక్రమ ఇసుక మాఫియా ముఠా రోజురోజుకు రెచ్చిపోతుంది. అటు నిబంధనలు తుంగలో తొక్కుతూ భారీగా ముడుపులు చెల్లిస్తూ యదేచ్చగా పుష్క అక్రమ రవాణా చేస్తూ మూడు పువ్వులు ఆరు కాయలుగా జేబులు నింపుకుంటూ ఇష్ట రాజ్యాంగ వ్యవహరిస్తుంది.

అంతేకాదు అక్రమ ఇసుక రవాణాకు సహకరిస్తున్న రెవెన్యూ పోలీస్ మైనింగ్ శాఖ లోని కొంతమంది అధికారులకు భారీగా ముడుపులు చెల్లిస్తూ రాత్రింబవలు ఇస్తారు ఇచ్చిన అక్రమ రవాణా చేస్తూ ఇతర రాష్ట్రాలకు పెద్ద పెద్ద లారీల్లో సరఫరా చేస్తూ ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. అలాంటి ఇసుక మాఫియాను వెంటనే అడ్డుకట్ట వేసి రైతులకు గ్రామస్తులకు న్యాయం చేయాలని ఉన్నత అధికారులను ప్రజలు కోరుతున్నారు.

అడుగంటి పోతున్న భూగర్భ జలాలు..

మంజీరా నదిలో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపడుతూ నిబంధనలు తుంగలో తొక్కుతూ అక్రమ ఇసుక రవాణా చేస్తూ ఇసుక మాఫియా చేస్తున్న దారుణాలకు భూగర్భ జలాలు అడుగంటిపోయి రైతన్నల పాలిట శాపంగా మారుతుంది.

అటు వర్షాలు లేక ఇటు నిల్వ లేక భవిష్యత్తులో రైతులు పంటలు పండించాలంటే సాగునీరు అందక ఎన్నో ఇబ్బందులు పడవలసిన దుస్థితి నిలబంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమంగా తవ్వకాలు చేపడుతూ భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో రైతులు పంటలను సాగు చేసుకోలేక రోడ్డున పడాల్సిన దుస్థితి నెలకొంటుందని అటు గ్రామస్తులు రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని రైతులకు గ్రామస్తులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

కన్నెత్తి చూడని మైనింగ్ శాఖ అధికారులు..

పోతంగల్ ఇసుక క్వారీలో ఇష్టారాజ్యంగా ఇసుక మాఫియా ముఠా రోజు రోజుకు రాత్రి పగలు తేడా లేకుండా విచ్చలవిడిగా తవ్వకాలు చేపడుతూ అక్రమ ఇసుక రవాణా చేపడుతున్న జిల్లాలోని మైనింగ్ శాఖ అధికారులు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఎన్ని ఫిర్యాదులు చేసిన ఎన్ని అడ్డంకులు చేసిన ఉన్నతాధికారులు మాత్రం అక్రమ ఇసుక రవాణాను ఎందుకు అరికట్టడం లేదని అటు ప్రజలు రైతులు ప్రశ్నిస్తున్నారు.

ఇంత జరుగుతున్న అటు మైనింగ్ శాఖ అధికారులు రెవెన్యూ అధికారులు పోలీస్ శాఖ అధికారులు ఎందుకు అరికట్టడం లేదని గ్రామస్తులు రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదని విమర్శలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారుల స్పందించి అక్రమ ఇసుక రవాణాని అరికట్టాలని గ్రామస్తులు రైతులు డిమాండ్ చేస్తున్నారు.