5 May, 2026 | 3:44 AM

అసోంలో హ్యాట్రిక్

05-05-2026 02:28 AM
  1. ఎన్డీయే కూటమికి బంపర్ మెజార్టీ
  2. 126 స్థానాల్లో బీజేపీ సొంతంగా ౮౨ స్థానాలు కైవసం
  3. మళ్లీ సీఎం హిమంత బిశ్వశర్మనే?
  4. కేవలం ౧౯ స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్

అసోం ప్రజలు ఆత్మీయంగా ‘మాము’ అని పిలుచుకునే సీఎం హిమంత బిశ్వశర్మ తన రాజకీయ చతురతతో, వ్యూహాత్మక ప్రణాళికలతో బీజేపీ నాయత్వంలోని ఎన్డీఏకు హ్యాట్రిక్ విజయాన్ని అందించారు. బంగ్లాదేశ్ చొరబాటు దారులపై ఆయన కఠినంగా వ్యవహరించారు.

దిస్పూర్, మే ౪: అసోం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించింది. రాష్ర్టంలో వరుసగా మూడోసారి ఆ పార్టీ అధికార పగ్గాలు చేపట్టనుంది. మొత్తం 126 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 64 అవసరం. కాగా బీజేపీ ఒంటరిగానే 82 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ పార్టీనే మరోసారి ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. బీజేపీకి ఇతర భాగస్వామ్య పక్షాలైన అస్సాం గణ పరిషత్ (ఏజీపీ) 10 స్థానాల్లో గెలిచింది.

బోడోలాం డ్ పీపుల్స్ ఫ్రంట్ (బీవోపీఎఫ్) 10 స్థానాలను దక్కించుకుంది. దీంతో ఎన్డీయే కూట మి బలం 100 దాటిపోయింది. ప్రస్తుత ము ఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మళ్లీ ముఖ్యమంత్రి రేసులో నిలిచారు. ఆయనకు రాష్ట్రం లో హిందుత్వ ఎజెండాతో పాటు అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేశారనే పేరుంది. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీకి తిరుగులేని నాయకుడిగా హిమంత ఎదిగారు. ప్రజల్లో ఆయనకున్న ఆదరణే పార్టీని మళ్లీ గెలిపించింది. పార్టీ అధిష్ఠానం కూడా ఆయన నాయకత్వం పట్ల పూర్తి సంతృప్తితో ఉంది. పరిపాలనపై ఆయనకున్న పట్టు అస్సాం సీఎం పీఠాన్ని మరోసారి ఆయనకు దక్కేలా చేసింది.

డీలాపడిన ప్రతిపక్ష పార్టీలు

ప్రతిపక్ష పార్టీలు ఈ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ కేవలం 19 స్థానాలకే పరిమితమైంది. అలాగే, ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఏఐడీఎఫ్) రెండు స్థానాలను గెలుచుకుంది. రాయ్ జోర్ దళ్ (ఆర్ జేఆర్ డీ) రెండు స్థా నాల్లో విజయం సాధించింది. ఆల్ ఇండి యా తృణమూల్ కాంగ్రెస్ (ఏఐటీసీ) ఒక స్థానాన్ని దక్కించుకున్నది  మరో స్థానంలో ఇతర స్వతంత్రం అభ్యర్థి విజయం సాధించారు. 

గత ఎన్నికల్లో

అసోం అసెంబ్లీకి గత ఎన్నికలు 2021 సంవత్సరంలో జరిగాయి. 126 అసెంబ్లీ స్థానాల్లో హిమంత బిశ్వ శర్మ నాయకత్వంలోని బీజేపీ  60 సీట్లను గెలుచుకుంది. ఎన్డీ యే కూటమి భాగస్వాములను మరో ౧౫ మంది ఎమ్మెల్యేలను కలుపుకొని బీజేపీ అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నాడు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ 29 స్థానాలకే పరిమితమైంది.