5 May, 2026 | 4:29 AM

అధికార పక్షాలకు గట్టి హెచ్చరిక

05-05-2026 03:17 AM
  1. ప్రజల అవసరాలను గుర్తించడంలో ప్రభుత్వాలు విఫలం
  2. అందుకే కీలక రాష్ట్రాల్లో చేదు అనుభవం
  3. అంతర్గత సర్వేలపై ఆధారపడటంతో తప్పని నష్టం 
  4. ప్రజలను పట్టించుకున్న వారికే పట్టం
  5. తెలంగాణకు హెచ్చరికగా తాజా ఫలితాలు
  6. ప్రాంతీయ పార్టీలకు ఊతమిచ్చేలా తమిళనాడు ఫలితాలు

హైదరాబాద్, మే 4 (విజయక్రాంతి): దేశంలో ప్రస్తుతం ఐదు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కీలకంగా మారాయి. తమిళనాడు, పశ్చి మ బెంగాల్, కేరళ, పుదుచ్చేరి, అసోం అసెంబ్లీల ఎన్నికల ఫలితాలు మరోసారి ప్రజాస్వా మ్యానికి అసలైన అర్థాన్ని గుర్తుచేస్తూ అధికార పక్షాలకు గట్టి హెచ్చరికను చేశాయి. ఒకవైపు అధికారంలో ఉన్న పార్టీలు ఎంత బలంగా కనిపించినా, ప్రజల అవసరాలు, ఆకాంక్షలను పట్టించుకోకపోతే ఓటుతో రాజకీయ సమీకరణాలను మార్చగలరని, మరోవైపు ప్రజలకు ఇచ్చిన హామీ లను నెరవేర్చడంలో చిత్తుశుద్ధి చూపిన ప్రభుత్వాలకు పట్టం కడతారని ఈ ఫలితాలు స్పష్టంచేశాయి.

ముఖ్యంగా ప్రజల భావోద్వేగాన్ని అంచనా వేయడంలో విఫలమైన తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్‌లో ని అ ధికార పక్షాలు ఓటమి పాలు కాగా.. అస్సోం, పుదుచ్చేరిలోని ఎన్డీఏ కూటముల అధికార పక్షాలు మాత్రం ప్రజలకు అందుబాటులో ఉండటంతో మళ్లీ అధికారానికి చేరువ య్యాయి. అధికార పార్టీలు క్షేత్రస్థాయిలో పెరుగుతున్న అసంతృప్తిని పట్టించుకోకుండా, అంతర్గత సర్వేలు, అనుకూల నివేదికలపై ఆధారపడటంతోనే ఫలితాల్లో మూడు రాష్ట్రా ల్లో చేదు అనుభవం ఎదురైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సర్వే నివేదికల కంటే ప్రజల భావోద్వేగం ముఖ్యమని ఈ ఫలితాలు మరోసారి నిరూ పించాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, ప్రకటించిన సంక్షే మ పథకాలు కేవలం ప్రకటనలుగా మిగిలిపోతే ఓటర్లు క్షమించరని ఈ ఫలితాలు హెచ్చ రిస్తున్నాయి. అభివృద్ధి పేరుతో హామీలు ప్రకటించినప్పటికీ, వాటి ప్రయోజనం సాధారణ ప్రజల జీవితాల్లో స్పష్టంగా కనిపించకపోవ డం అసంతృప్తికి దారితీస్తుంది. సుదీర్ఘ పాలనలో సహజంగా వచ్చే ప్రభుత్వంపై వ్యతిరేకత చాలా పార్టీలు తక్కువ అంచనా వేసినట్టు కనిపిస్తున్నది.

ప్రజల ప్రత్యక్ష జీవితాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో ఆలస్యం అయితే, అది రాజకీయంగా భారీ నష్టానికి దారితీస్తుందని ఈ ఎన్నికలు స్పష్టంచేశాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతు న్న ప్రచారాలు నిజమైన ఓటింగ్‌ను ప్రతిబింబించలేవని మరోసారి ఈ ఫలితాలు వెల్లడి స్తున్నాయి. ఆన్‌లైన్‌లో కనిపించే మద్ద తు, క్షేత్రస్థాయిలో ఓట్లుగా మారడం లేదు. డిజిటల్ క్యాంపెయిన్‌తోపాటు ప్రత్యక్ష ప్రజాస ంబంధం అవసరమని పార్టీలకు ఇది ఒక స్పష్టమైన హెచ్చరిక అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

దీంతోపాటు ఈ ఎన్నిక ల్లో యువత, మహిళల ఓటు కీలకంగా మా రింది. వారు ఉపాధి అవకాశాలు, భద్రత, సంక్షేమ పథకాలపై స్పష్టమైన ఫలితాలు కోరుతున్నారు. ఈ వర్గాలను నిర్లక్ష్యం చేసిన పార్టీలకు నష్టం తప్పలేదని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ ఫలితాలు ఓటర్లలో పెరుగుతున్న అవగాహనకు నిదర్శనం. కులం, మతం, భావోద్వేగా ల కంటే అభివృద్ధి, పనితీరు, పారదర్శకతకు ప్రాధాన్యం పెరుగుతు న్నది. ఇది భారత రాజకీయాల్లో ఒక కీలక మార్పు సంకేతంగా భావిస్తున్నారు.

తెలంగాణకూ హెచ్చరికే

తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో అధికార పక్షాలకు ఎదురైన ఓటమి దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అదే తరహా సంకేతాలు భవిష్యత్‌లో తెలంగాణలోనూ కనిపించే అవకాశం ఉందా అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నది. పాలనలో లోపాలు, ప్రజల అవసరాలను నిర్ల క్ష్యం చేస్తే ఎన్నికల ఫలితాల్లో చేదు అనుభవం తప్పదనే అంశం ప్రధాన చర్చగా మా రింది. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమంపై ప్రజల నుంచి వ్యక్తమవు తున్న సంతృ ప్తి, వ్యతిరేకత ఇప్పుడు కీలకంగా మారాయి.

ముఖ్యంగా యువతలో ఉద్యోగ అవకాశాలు, రైతుల, ఉద్యోగుల సమస్యలు, పరిపాలనలోని లోపాల వంటి అంశాలపై అసంతృప్తి పెరుగుతున్నట్టు స్పష్టంగా తెలుస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా తలెత్తుతున్న సమస్యల ను ఎప్పటికప్పుడు పరి ష్కరించకపోతే తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ మాదిరిగానే రాబోయే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

ఇతర రాష్ట్రా ల్లోలాగే తెలంగాణలో కూడా ఇచ్చిన హామీలెన్ని.. అమలు అయిందెన్నీ అన్నది కీల కంగా మారుతున్నది. సంక్షేమ పథకాల అ మలులో లోపాలు, ఆలస్యం వంటి అం శాలు ప్రజల్లో చర్చకు దారితీస్తున్నాయి. ఇది కొనసాగితే ఓటర్లలో అసంతృప్తి పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషణలు చెబుతున్నాయి. ముఖ్యంగా యువ త, మహిళల ఓటు ప్రాధాన్యం తెలంగాణలోనూ పెరుగుతున్నది. ఉపాధి, భద్రత, సంక్షేమం వంటి అంశాలపై స్పష్టమైన ఫలితాలు కోరుకుంటున్నారు.

ఈ వర్గాలు తమ అంచనాలకు తగ్గ పాలన లేకపోతే ఫలితాలను తారుమారు చేసే సామర్థ్యం కలిగి ఉన్నారని గత ఎన్నికలే స్పష్టంచేశాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళలో వచ్చిన ఫలితాలు తెలంగాణ రాజకీయాలకు ఒక ముందస్తు హెచ్చరికగా భావించవచ్చని, ఇప్పటికైనా ప్రజల అవసరాలను, ఆకాంక్షలను గుర్తించకపోతే ఏ పార్టీలకైనా, ముఖ్యం గా అధికార పక్షాలకు గెలుపు అవకాశాలు తగ్గే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

ప్రాంతీయ పార్టీలకే ప్రత్యామ్నాయ అవకాశం

ప్రాంతీయ పార్టీల పాలనలో ఉన్న ఆయా రాష్ట్రాల్లో అవినీతి, అసంతృప్తి కారణంగా ప్రజలు మార్పు కోరుకున్నప్పుడు ప్రత్యామ్నాయం కోసం చూస్తారు. అయితే అలాంటి పరిస్థితుల్లో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లను కాదని మరో ప్రాంతీ య పార్టీకే ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉందని తమిళనాడులో టీవీకే పార్టీ విజయం సాధించి నిరూపించింది.

ము ఖ్యంగా ప్రభుత్వ వైఫల్యాలు ప్రాంతీయ పార్టీలకు మంచి అవకాశంగా మారుతున్నాయి. తమిళనాడులో డీఎంకే పరిపాలనా లోపం కారణంగా విజయ్ నేతృత్వంలోని మరో ప్రాంతీయ పార్టీ అయిన టీవీకే వైపు ప్రజలు మొగ్గు చూపారు. దేశంలోని చాలా రాష్ట్రా ల్లో ఇదే తరహా పరిస్థితులు నెలకొంటున్నా యి. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రాంతీయ పార్టీల ప్రభావం అధికంగానే ఉన్నది. గతంలో ఏపీలో టీడీపీ వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చింది.

ప్రస్తుతం తెలంగాణలో కవిత ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్, తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో బీసీ రాజ్యాధికార పార్టీ వంటివి క్రియాశీలకంగా మారుతున్నాయి. స్థానిక సమస్యలు, ప్రాంతీయ భావోద్వేగం ప్రాంతీయ పార్టీలకు కలిసి వచ్చే అంశంగా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే తాజా ఫలితాలు ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీ య పార్టీలకు ఊతమిచ్చే విధంగా ప్రభావం చూపాయని స్పష్టంచేస్తున్నారు.

మూడు రాష్ట్రాల్లో అధికార పక్షాలకు ఎదురుదెబ్బ

తాజా ఎన్నికల ఫలితాలు ముఖ్యంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ వంటి కీలక రాష్ట్రాల్లో అధికార పక్షాలకు ఎదురైన ఓటమి పెద్ద చర్చకు దారితీసింది. పాలనలో లోపాలు, ప్రజల అవసరాలపై నిర్లక్ష్యంగా ఉంటే అధికారం నిలబెట్టుకోలేరని ఈ ఫలితాలు స్పష్టంచేశాయి. తమిళనాడులో అధి కార పక్షమైన డీఎంకే ప్రకటించిన సంక్షేమ పథకాలు ఉన్నప్పటికీ, వాటి అమలులో లోపాలు ఉన్నాయనే అభిప్రాయం ఓటర్లలో పెరిగిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ధరల పెరుగుదల, ఉపాధి అవకా శాలపై అసంతృప్తి ప్రభావం చూపినట్టు విశ్లేషకులు చెప్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న టీఎంసీ పాలనలో రాజకీయ ఉద్రిక్తతలు, హింసా ఆరోపణలు ఓటర్లను ప్రభావితం చేసినట్టు భావిస్తున్నారు. పాలనలో స్థిరత్వం, పారదర్శకతపై ప్రశ్నలు తలెత్తడంతో ఓటర్లు ప్రత్యా మ్నాయం వైపు మొగ్గుచూపిన సంకేతాలు కనిపిస్తున్నాయి. కేరళలో సంప్రదాయంగా ఉన్న రాజకీయ మార్పుకు అనుగుణంగా ఈసారి కూడా ప్రభుత్వ వ్యతిరేకతపై ప్రభావం కనిపించింది. అభివృద్ధి, సంక్షేమం అమలవుతున్నప్పటికీ ప్రజలు మార్పు కోరుకున్నారు.

ఇందులో భాగంగానే లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్‌ను గద్దె దించారు. ఈ మూడు రాష్ట్రాల్లో వేర్వేరు రాజకీయ పరిస్థితులు ఉన్నప్పటికీ, కొన్ని సాధారణ అంశాలు స్పష్టంగా బయటపడ్డాయి. ప్రజల భావోద్వేగాన్ని సరిగ్గా అంచనా వేయడంలో అధికార పక్షాల వైఫల్యం, హామీల అమలులో లోపాలు, ప్రభుత్వంపై వ్యతిరేకత, యువత, మహిళల ఓటు ప్రభావం వంటివి కీలకంగా వ్యవహరించాయని విశ్లేషకుల అభిప్రాయపడుతు న్నారు. ప్రజలకు అందుబాటులో లేకపోతే, పాలనలో చిన్న లోపాలే పెద్ద రాజకీయ నష్టానికి దారితీస్తాయని ఈ ఫలితాలు దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలకు ఒక హెచ్చరిక గా నిలుస్తున్నాయి.