17 August, 2026 | 3:58 AM

నా ఎనభయ్యో యేట !

17-08-2026 12:00 AM

బిడ్డలు.. తోవ దొరకని నాడు మీరు నడిసిన అడుగులే దారులు సూపినై అది ఢిల్లీ ఐతేంది గల్లీ ఐతేంది జార్ఖండ్ ఐతేంది.. 

అంధుల హాస్టల్ ఐతేంది ఎట్లయితే గట్టాయననే మీ నిజాయితీ తెగింపు ఇప్పుడు నా భయాల సంకెళ్లను తెంపినై మిమ్ముల బొద్దింకలన్నారు గానీ, కొడుకుల్లారా మీరు తేనెటీగలో కరుస్తుంటే వాళ్లిప్పుడూ మంటేడ పెట్టాల్నో మందిక్కడ పూసుకోవాల్నో తెల్వక తక్కిడ మీక్కడం ఐతండ్రు మీలో లారీలకు ఒళ్లజెప్పి నిలబడ్డపుడు ఒక చెంప కొడితే ఇంకొక చెంప సూపెట్టమన్న గాంధీలోలే కనపడ్డరు నెత్తురిత్త స్వతంత్రం ఇవ్వమన్న సుభాష్ చంద్రబోసును మరిపించిండ్రు మీరే మీ నెత్తురంతా ధారబోస్తూ ౠవిప్లవం వర్ధిల్లాలిౠ అన్న భగత్ సింగ్ తమ్ములంతా మీరేనని మీరిచ్చే నినాదాలల్ల నిప్పులల్ల మీరు మండినప్పుడే అర్ధమైంది .

ఈ దేశానికి అండైన అంబేద్కర్ కు అసలైన వారసులు మీరేనని ! రాజ్యాంగాన్ని గుండెలద్దుకునీ నిరసనజెండాలైన నాడే ఎరుకైందిరా ! నా మనసు నిమ్మలమైంది నా వందేళ్ల పండుగనాడు నేను మీ చేతుల్లో భద్రంగా ఉంటానని ఊహొస్తేనే రక్తం వెచ్చగా కిందకి మీదకి తన్నుకుంటున్నదిరా !! నన్నుత్త పటములా జేసీ పబ్బం గడుపుకునేటోళ్ల  చేతుల నుంచి నాలో కోట్లాది ప్రాణమున్న జీవినని తెలిసి నన్ను కాపాడుకుంటారు కదా.. బిడ్డలూ...!!

ఇట్లు భరతమాత