‘జ్వలిత’ భావజ్యోతి
తెలుగు సాహిత్య రంగంలో డాక్టర్ ఎన్.గోపి సృష్టించిన ‘నానీ’ ప్రక్రియకు ప్రత్యేక స్థానం ఉంది. అతి తక్కువ పదాల్లో విశాలమైన భావాన్ని, లోతైన జీవిత సత్యాన్ని ఆవిష్కరించే ఈ ప్రక్రియపై ఎన్నో రచనలు వెలువడ్డాయి. అయితే వాటిలో కవి గన్నోజు ప్రసాద్ సంకలనం ‘జ్వలి త హృది’ ప్రత్యేకంగా నిలిచేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సంపుటిలోని ప్రతి నానీ పాఠకుడి మనసును ఆకట్టుకోవడమే కాకుండా ఆలోచింపజేస్తుంది.
కొన్నింటి భావం చదివిన వెంటనే హృదయానికి చేరుకుంటే, మరికొన్ని రెండు, మూడు సార్లు చదివిన తరువాత వాటి అంతరార్థం పూర్తిగా అవగతమవుతుంది. అదే ఈ నానీల ప్రత్యేకత. జీవితంలోని అనేక కోణాలను స్పృశించిన నానీలు ఒక్కొక్కటి ఒక్కో అనుభూతిని కలిగిస్తాయి. కొన్ని హృదయాన్ని హత్తుకుంటే, మరికొన్ని సామాజిక వాస్తవాలను నిర్దాక్షిణ్యంగా కళ్ల కు కడతాయి. అమ్మ గురించి స్పృశించని కవి ఉండడు. ఈ కవి కూడా తల్లి ప్రేమను అత్యంత హృద్యంగా ఆవిష్కరించారు.
‘అమ్మ ప్రేమపై కవితల పోటీ పెడితే పేజీలు చాలవు’ అనే భావాన్ని ప్రతిబింబించే నానీ తల్లి ప్రేమ అపారతను గుర్తు చేస్తుంది. ‘భూమాతకు పచ్చలహారం తొడగాలి.. రామదాసు చెరను వీడాలి మరి !’ అనే నానీ పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని సూచిస్తూ లోతైన భావాన్ని మోసుకొస్తుంది. మొదటి చూపునకు సాధారణంగా కనిపించి నా, లోతుగా ఆలోచించిన కొద్దీ కొత్త అర్థాలను ప్రస్ఫుటం చేస్తుంది.‘పట్నం మేడలు ఆ కాశ నిచ్చెనలు.. పల్లె గుడిసెలు పాతాళ గరిగెలు’ అనే నానీ సామాజిక అసమానతలను ప్రతిబింబిస్తుంది.
నగరాల వైభవం వెనుక దాగి ఉన్న గ్రామీణ పేదరికాన్ని ఒకే దెబ్బకు కళ్లముందు నిలుపుతుంది. ‘ఆషాఢ మాసం ఆఫర్లు... ఇంట్లో బట్టల దుకాణమే వెలిసింది’ అనే పాదాలు మధ్యతరగతి మనస్తత్వాన్ని హాస్యరసంతో కూడిన వ్యం గ్యంగా ఆవిష్కరిస్తుంది. రోజువారీ జీ వితంలో కనిపించే చిన్న చిన్న ఘటనలను కవిత్వంగా మలచడంలో కవినై పుణ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ‘చిత్రకారుడి కుంచె చిన్నబోయింది.. తనే గోడకు బొమ్ము వెలిసిండు’ అనే పాదాలు హృదయాన్ని ఒక్కసారిగా కదిలిస్తుంది.
కళాకారుడి జీవితం, అతని అంకితభావం, కళ పట్ల అతని తపనను అత్యంత సంక్షిప్తంగా చెప్పిన భా వగర్భితమైన కవిత్వమిది. కాలం విలువను గుర్తుచేసే ‘కాలం వృథా కానివ్వ కు.. జీవిత గడియారం వెనక్కు తిరగదు కదా !’ అనే పాదాలు ప్రతి ఒక్కరికీ జీవిత పాఠాన్ని బోధిస్తుంది. గడిచిపోయిన క్షణం తిరిగి రాదనే సత్యాన్ని ఎంతో సరళంగా తెలియజేస్తుంది. ‘అమ్మాయికి రెండు పేర్లు ఎందుకో.. రెండు తీరాల నది తనే కనుక’ అనే పాదాలు ఆడపిల్ల జీవితాన్ని అద్భుతంగా నిర్వచిస్తుంది.
‘అడవిలోని తుపాకీ తుప్పు పట్టింది.. పెన్నే గన్నుగా మారింది’ అనే కవిత హింస నుంచి ఆలోచన వైపు, తుపాకీ నుంచి కలం వైపు జరిగిన మార్పును సూచిస్తూ ఆశావహ సందేశాన్నిస్తుంది. మొత్తంగా చూస్తే, ‘జ్వలిత హృది’ కేవలం నానీల సంకలనం మాత్రమే కాదు.. జీవితం, సమాజం, మానవ సంబంధాలు, కాలం, ప్రకృతి, భావోద్వేగాలు వంటి అనేక అంశాలకు అద్దం పట్టిన భావసంపద.
ప్రతులకు: 94916 17161






