ఓదెల మల్లన్న క్షేత్రంలో..
అశోక్ తేజ దర్శకత్వంలో తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఓదెల 2. ఈ చిత్రం మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ హై బడ్జెట్ మల్టీ లింగ్వల్ గా రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ ఓదెల గ్రామంలోని మల్లన్న క్షేత్రంలో ప్రారంభమైంది. 2021లో మంచి విజయం సాధించిన ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందుతోంది.
తమన్నా ఈచిత్రంలో శివశక్తి (నాగ సాధు) పాత్రలో నటిస్తోంది. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సౌందర్‌రాజన్ డీవోపీ, రాజీవ్ నాయర్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.






