2 March, 2026 | 12:12 AM

స్పిరిట్ కీ రోల్స్‌లో..

28-02-2026 12:00 AM

స్టార్ హీరో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పాన్‌వరల్డ్ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’. సందీప్ రెడ్డి వంగా కథ, ఎడిటింగ్, దర్శకత్వం వహిస్తున్నారు. టీ -సిరీస్ ఫిలిమ్స్, భద్రకాళి పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. భూషణ్ కుమార్, ప్రణయ్‌రెడ్డి వంగా, కృష్ణకుమార్, ప్రభాకర్‌రెడ్డి వంగా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

2027 మార్చి 5న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో 8 భాషల్లో విడుదల కానుందీ చిత్రం. ఇందులో ప్రభాస్‌కు జోడీగా త్రిప్తి డిమ్రి కనిపించనుంది. వివేక్ ఒబెరాయ్ శక్తిమంతమైన పాత్రలో అలరించనుండగా, ఐశ్వర్య దేశాయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా వీరిద్దరి ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో వివేక్ లుక్ అమితంగా ఆకట్టుకుంటోంది. ఐశ్వర్య కూడా ఆకర్షణీయంగా కనిపిస్తోంది.