సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల్లో..
నారాయణ విద్యార్థులు అద్భుత ప్రతిభ!
హైదరాబాద్, మే 14(విజయక్రాంతి): సీబీఎస్‌ఈ 12వ తరగతి బోర్డు పరీక్షా ఫలితాల్లో నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు మరోసారి తమ అకడమిక్ నైపుణ్యాన్ని చాటుకుంటూ అద్భుత ఫలితాలను సాధించారు. 500 మార్కులకుగాను 494 మార్కులు సాధించి భూమిజ(కర్ణాటక) టాపర్‌గా నిలిచింది. అలాగే ఆర్.జస్వంత రామ్(ఆంధ్రప్రదేశ్), సోహమ్ పెడ్నేకర్(మహారాష్ట్ర) వీరిరువురూ 492 మా ర్కులు సాధించి నారాయణ విద్యా సంస్థల ఘనతను చాటారు.
485, ఆపైన మార్కులు 27 మంది సాధించారు. అదే విధంగా నారాయణ విద్యా సంస్థల మొత్తం ఉత్తీర్ణతా శాతం 94.8%గా నమోదైందని నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్స్ డాక్టర్ పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ పి.సింధూర నారాయణ మాట్లాడుతూ ‘నారాయణలో దశాబ్దాల పరిశోధనతో రూపొందించిన ఇంటిగ్రేటెడ్ కరికులమ్‌ను అందిస్తున్నట్లు తెలిపారు.
సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, వివిధ స్టేట్ బోర్డుల ఉత్తమ పద్ధతులను మిళితం చేసి, విద్యార్థులకు సబ్జెక్టులపై పూర్తి అవగాహన కల్పిస్తాం. ఇదే వారిని పోటీ ప్రపంచంలో రాణించేలా చేస్తుంది అని పేర్కొన్నారు. పి.శరణి నారాయణ మాట్లాడుతూ ‘నారాయణ ‘మైక్రో-షెడ్యూల్’ విధానం వల చదువు క్రమపద్ధతిలో, ఆసక్తికరంగా సాగుతుందన్నారు. అలాగే ప్రతి సబ్జెక్టును చిన్న చిన్న అంశాలుగా విభజించి అకడమిక్ క్యాలెండర్‌కు అనుగుణంగా బోధిస్తున్నామన్నారు.
దీనివల్ల విద్యార్థుల ప్రగతిని ఎప్పటికప్పుడు గమనిస్తూ, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక మెంటరింగ్, డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ ద్వారా అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. 47 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన నారాయణ విద్యా సంస్థలు, ప్రతి ఏటా కొత్త మైలురాళ్లను అధిగమిస్తూ, విద్యార్థుల కలలను సాకరం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి.
ఈ అద్భుత విజయం సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు డాక్టర్ పి.సింధూర నారాయణ, పి.శరణి పొంగూరు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ విజయానికి కృషి చేసిన టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ వారు కృతజ్ఞతలు తెలియజేశారు.






