30 July, 2026 | 5:49 PM

Breaking News

రైతు సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి   •   గోల్పర్తిలో విషాదం.. బాధిత కుటుంబానికి అండగా మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు   •   పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   ప్రభుత్వ పాఠశాలలకు యూనిఫాంలు, హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలి   •   ప్రణాళికాబద్ధంగా రాజన్న ఆలయ విస్తరణ పనులు   •   మొదటి వేతనం ఆలయానికి విరాళం   •   సేవలే శాశ్వత గుర్తింపు: సీఎంఓ భీమ్ గొండ   •   నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 11 మంది ఏఎస్ఐలకు ఎస్‌ఐలుగా పదోన్నతి   •   ఉపాధ్యాయుల సామర్థ్యాభివృద్ధితోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించగలం   •   బైక్ ప్రమాదంలో మహిళ మృతి   •  

అమ్మ భగవాన్ బోధనల నేపథ్యంలో..

15-05-2026 12:05 AM

ఆధ్యాత్మికతను, మానవ సంబంధాలను మేళవిస్తూ శ్రీ ఆది లక్ష్మి పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం ‘ఏదైనా సాధ్యమే’. ‘దైవం తోడుంటే..‘ అనేది ఉపశీర్షిక. ఈ మూవీ టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు మద్దూరి రాజా, నిర్మాత అనిల్ మునగనూరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎన్ సుబ్రహ్మణ్యం, చిత్రబృందం పాల్గొన్నారు.

ఈ సినిమా కథనం ప్రధానంగా అమ్మ భగవాన్ చెప్పిన ఐదు సూత్రాల చుట్టూ తిరుగుతుందని టీమ్ వెల్లడించారు. కథ, మాటలు, సాహిత్యాన్ని అందిస్తూ నిర్మాణ బాధ్యతలను చేపట్టిన అనిల్‌కుమార్ మునగనూరి మాట్లాడుతూ.. “ఒక వ్యక్తికి జీవితంలో భగవంతుడి బంధం ఉన్నట్లయితే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో, అసాధ్యాలు సుసాధ్యాలుగా మారుతాయనేది ఈ చిత్రం ద్వారా చెప్పదలుచుకున్నాం” అని చెప్పారు. ఈ చిత్రానికి రమేశ్ సినిమాటోగ్రఫీని, ఫణీంద్ర ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.