30 July, 2026 | 6:10 PM

బైక్ ప్రమాదంలో మహిళ మృతి

30-07-2026 05:17 PM

మహా ముత్తారం,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహా ముత్తారం మండలం స్తంభంపల్లి (పీకే) గ్రామానికి చెందిన కోడి సుగుణ తన పిల్లలను బుధవారం కాటారం హాస్టల్లో దింపడానికి వెళ్లారు సాయంత్రం బోర్ల గూడెం  గ్రామానికి చేరుకున్నారు.  వరుసకు అల్లుడు అయినా ఓల్లాల రమణయ్య , బైక్ పైన తన సొంత గ్రామానికి వెళుతుండగా మార్గమధ్యలో ఒక ఎద్దును బైకు ఢీకొని ప్రమాదం జరిగి రోడ్డు మీద పడి గాయాలైనాయి. అది తెలుసుకున్న కుటుంబ సభ్యులు ప్రమాదం జరిగిన చోటికి చేరుకొని హుటాహుటిన భూపాలపల్లి లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ డాక్టర్లు పరీక్షించి చనిపోయినదని తెలిపారు. భర్త కోడి పోచం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ డి రాజయ్య తెలిపారు.